సేంద్రీయ సాగుకు చేయూత ఇస్తారా?

The organic movement in adilabad forest
 • సేంద్రీయ సాగుకు చేయూత ఇస్తారా?సేంద్రీయ మిత్ర
  వ్యవసాయంలో సేంద్రీయ శకం ప్రారంభమైంది.  ఇటీవలి కాలంలో సేంద్రీయ వ్యవసాయం మీద రైతులకు, ప్రభుత్వాలకు, వినియోగదారులకు ఆసక్తి పెరిగింది.  రసాయన ఎరువులు, పురుగు మందులు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశాయి.
  హరిత విప్లవం తర్వాత ప్రకతి మీద నిరంతరం జరుగుతున్న ఈ దాడిని అదుపు చేయాలంటే సేంద్రీయ వ్యవసాయం ఒక్కటే మార్గం.
  సేంద్రీయ వ్యవసాయం అంటే మన సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను మళ్ళీ ఆహ్వానించడం.
  సేంద్రీయ వ్యవసాయం అంటే మన నేలతల్లిని, మన సాటి మనుషులను, మనతో కలసి జీవించే జంతువుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం.
 • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఏకలవ్య ఫౌండేషన్‌ లక్ష్యం.
 •  పదివేల ఎకరాల చొప్పున ఆంధ్రా,తెలంగాణలో మొత్తం 20 వేల ఎకరాల్లో సేంద్రీయ సాగును ప్రోత్సహించడం ఏకలవ్య ఫౌండేషన్‌ లక్ష్యం.
 •  2021 నాటికల్లా రెండు రాష్ట్రాల్లోనూ 20 వేల ఎకరాల ఆర్గానిక్‌ సర్టిఫైడ్‌ భూమిని తయారు చేయాలన్న  సంకల్పమే ఈ ‘సేంద్రీయ మిత్ర’.
 •  ఆర్గానిక్‌ వ్యవసాయం మీద రైతులకు నిపుణులతో శిక్షణ ఇప్పించాలని ఏకలవ్య ఫౌండేషన్‌ సంకల్పం. రైతులు పండించిన సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు PGSఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ కూడా లభించేలా కషి చేయనుంది.
  Sendriya poster 1 copy

  Sendriya poster 1 copy

 • ఈ కార్యక్రమం ద్వారా 5 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
 •  ఈ బహత్తర కార్యక్రమానికి ఏకలవ్య ఫౌండేషన్‌ సేంద్రీయ మిత్రుల నుంచి సహకారాన్ని కోరుకుంటోంది.
 • 5 ఎకరాల భూమిని సేంద్రీయ వ్యవసాయ భూమిగా మార్చడానికి 10,000 రూపాయలు అవసరమవుతాయి.
 •  20 వేల ఎకరాల కోసం అవసరమైన నిధిని సమీకరించడానికి, సేంద్రీయ మిత్రుల నుంచి విరాళాలను ఆహ్వానిస్తోంది.
 • 10,000 రూపాయలను విరాళంగా పంపే ‘ సేంద్రీయ మిత్రుల ‘కు హదయపూర్వక స్వాగతం.
  రండి, మాతో చేతులు కలపండి, నేలను కాపాడుదాం, ప్రకృతిని రక్షిద్దాం.Account:Ekalavya FoundationA/c No. 370010100128919  ,Axis Bank, Himayatnagar Branch, Hyderabad, Telangana,

  IFSC: UTIB0000370

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *