నిన్న మాటిచ్చాడు… నేడు పల్లె కొచ్చాడు

Prakash Raj in kondareddipalle

నిన్న మాటిచ్చాడు… నేడు పల్లెకు వచ్చాడు

Prakash Raj visited kondareddipalle

 Prakash Raj visited kondareddipalle

తెర మీద నలుగురిని తన్నడం హీరోయిజం కాదు. తెర వెనుక నలుగురికి సాయం చేసిన వాడే అసలైన హీరో అని నిరూపించ బోతున్నాడు… విలక్షణ నడుడు ప్రకాశ్‌ రాజ్‌.
నిన్న పంచాయితీరాజ్‌ శాఖమంత్రి కేటీఆర్‌ని కలిసి మహబూబ్‌ నగర్‌ జిల్లా, కేశం పేట మండలంలోనిి కొండారెడ్డిపల్లె గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ఇక్కడ చదివారు కదా.
అన్న మాట ప్రకారం ఈ రోజు చిరు చినుకుల మధ్య కొండారెడ్డిపల్లె గ్రామీణులను ప్రకాశ్‌ రాజ్‌ కలిశారు. ” మీ గ్రామాన్ని ఎలా అభివృద్ది చేద్దామని అడిగి వారి సలహాలను తీసుకున్నారు. పల్లెకు వచ్చింది నాయకుడినై పోదామని కాదు. మీ సమస్యలు తెలుసుకొని గ్రామాన్ని ఎలా అభివృద్ది చేయాలో తెలుసుకుందామని వచ్చానని కొండారె డ్డి పల్లెను అన్ని విధాలా బాగు చేయడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రకాశ్‌రాజ్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ శ్రీదేవి కూడా గ్రామంలో పర్యటించారు.
ఇంత వరకు తెరమీద చూసిన తమ అభిమాన నటుడు ఒక్క సారి గ్రామంలో ప్రత్యక్షమవ్వడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
తను దత్తత తీసుకుంటున్న పల్లెను సందర్శించిన తరువాత తన అనుభూతిని ఇలా ట్వీట్‌ చేశారు …

” another journey begins.. Touching life is bliss. Will seek your support soon . Let’s give back to life …. Cheers”

Related posts