జీవితం చిగురించింది

Google+ Pinterest LinkedIn Tumblr +

జీవితం చిగురించింది
అచ్యుతాపురానికి 15 కిలోమీటర్ల దూరంలోని దిమిలి గ్రామంలో పేదరికం ఎక్కువ. కొందరు పొలం పనుల మీద మరికొందరు దినసరి వేతన కూలీలుగా ఇంకొందరు కులవృత్తుల మీద ఆధారపడి బతుకుతున్నారు. వెంకటకనకమహాలక్ష్మి ఎనిమిదో తరగతి వరకు చదివి ఆ పై చదివే స్తోమతు లేక ఆపేసింది.ఆమె తండ్రి ఉన్న ఊర్లో కులవృత్తికి డిమాండ్‌ లేక కేరళకు వలస వెళ్లి అక్కడే సెలూన్‌ పెట్టుకుని బతుకుతూ కుటుంబానికి కుటుంబానికి కొంత పంపుతున్నాడు. అప్పులు చేసి కనకమహాలక్ష్మికి పెళ్లి చేసి అత్తారింటికి పంపారు.ఎన్నో ఆశలతో కాపురానికి వెళ్లిన లక్ష్మికి, భర్త నిరాదరణ,వేధింపులు ఎదురయ్యాయి. వాటిని భరించలేక పుట్టింటికి వచ్చేసింది. తల్లికి భారం కాకుండా తన కాళ్ల మీద తను నిలబడాలనుకుంది కానీ కుగ్రామంలో బతుకు తెరువు కష్టమైంది. కూలిపనులు తప్ప వేరేమార్గంలేదు. ఆ సమయంలో ‘బ్రాండిక్స్‌’లో పనులున్నాయని తెలిసి కంపెనీని సంప్రదిస్తే వారు కొంత శిక్షణనిచ్చి ఉద్యోగం ఇచ్చారు.
” ట్రైనింగ్‌ పొంది కంపెనీలో హెల్పర్‌గా చేరాను. పనిలో నా ప్రతిభను చూసి క్వాలిటీ సెల్‌కి ప్రమోట్‌ చేశారు. ఐదు వేలకు పైగా జీతం వస్తుంది. భర్త నిరాదరణకు గురైనా పుట్టింటికి భారమవుతానని ఆందోళన చెందిన నాకు ఈ ఉద్యోగం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. నాతోపాటు మా వూరి నుండి పదిహేను మందికి ఉపాధి దొరికింది. నాలాగా కుటుంబసమస్యలున్న వారూ ఉన్నారు. వారంతా హ్యాపీగా బతుకుతున్నారు. బ్రాండిక్స్‌ మాకో కొత్త జీవితాన్నిచ్చింది.” ఆని ‘రూరల్‌మీడియా’తో ఆనందంగా చెప్పిందా కష్టజీవి.

Share.

Leave A Reply