పూడిక తీస్తే ఊరంతా వేడుక

Google+ Pinterest LinkedIn Tumblr +

పూడిక తీస్తే ఊరంతా వేడుక
దశాబ్గాల క్రితం పురాతన సీతారాముల విగ్రహాలు ఈ చెరువు అడుగున దొరకడంతో ఈ ప్రాంతం ‘రామతీర్థం'(విజయనగరం జిల్లా) గా మారింది. బోర్లించిన కొబ్బరి చిప్పలా ఉన్న గంధకపు కొండ మీద కురిసిన వానంతా ఈ చెరువులోకి చేరి ఊరికి నీటి కొరత లేకుండా ఉండేది.
గత కొన్నేళ్లుగా చెరువులో పూడిక పేరుకు పోవడంతో జలమట్టం తగ్గి పోయింది. 30 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువులో ప్రజలంతా ఏకమై పూడికతీశారు.
ఆ మట్టితో చెరువు గట్టును పటిష్టం చేశారు. ఒండ్రు మట్టిని రైతులు పొలాల్లో చల్లి భూసారం పెంచారు. వరి, మొక్కజొన్న, మినుములు, పెసల దిగుబడి గతంలో కంటే పెరిగిందని ఈ ప్రాంతపు రైతులు మాతో అన్నారు.ఇక్కడి 250 ఎకరాలకు ఈ చెరువు నీరే ఆధారం. అంతే కాదు దీనిలో చేపల వేట వల్ల కొందరు జాలర్లకు బతుకు తెరువు దొరికింది.

Release of Navyandhralo Upàdhi Velugulu by Chief Minister on 18.7.17 during Cabinet meeting

Release of Navyandhralo Upàdhi Velugulu by Chief Minister on 18.7.17 during Cabinet meeting

ఇలాంటి 70 వైవిధ్య జీవన దృశ్యాలతో రూరల్‌మీడియా డాక్యుమెంట్‌ చేసిన కాఫీ టేబుల్‌ బుక్‌ని ఇటీవల ఏపీ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గారికి అందించాం.

Share.

Leave A Reply