ఎరువుల కంపనీల దోపిడీ ఇది…

Google+ Pinterest LinkedIn Tumblr +

”నేను గతంలో ఎరువుల డీలర్‌గా పనిచేశాను. 10 రూపాయల పురుగు మందు రైతు చేతికి వచ్చేసరికి 90 రూ. అవ్వడం చూశాక రసాయనక మందుల కంపెనీలు రైతులను ఎలా దోపిడీ చేస్తున్నాయో గమనించాను. వెంటనే ఆ ఉద్యోగం మానేసి మాకున్న నాలుగు ఎకరాల్లో రసాయన ఎరువులు లేకుండా వ్యవసాయం మొదలుపెట్టాను. మొదట్లో దిగుబడి తక్కువగా వచ్చింది. ఏకలవ్య ఫౌండేషన్‌  జిన్‌గుర్తిలో(vikarabad dist) సేంద్రియ సాగుపై శిక్షణ ఇవ్వడంతో బయోకంపోస్టు, కషాయాలు గురించి తెలుసుకున్నాను. నా భార్య లక్ష్మితో కలిసి సేంద్రియ వరి పండిస్తున్నాను. ఎకరానికి రెండు లీటర్ల పెరుగు ద్రావణం పిచికారీ చేస్తున్నాను. గతంలో రసాయనాలను వాడినపుడు 17 బస్తాలు దిగుబడి వచ్చేది. నేడు సేంద్రియ సాగులో ఎకరానికి 21 బస్తాలు దిగుబడి వస్తోంది. నన్ను చూసి మా చుట్టుపక్కల రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు వస్తున్నారు.వరితోపాటు దోస, మిరప, పెసర కూడా పండిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాను”.
– సగిలి అమరనాథరెడ్డి,లక్ష్మి, చిన్నలేబాకు, వల్లూరు (మం), కడపజిల్లా.

Share.

Leave A Reply