ఓ రాములన్నా.. జర చూడన్నా…

Open letter to Chairman of TS BC Commission

ఓ రాములన్నా.. జర చూడన్నా…
…………………………………
ఎవరు వీరు?
మీరు రాసిన అనేకనేక కతల్లోని పాత్రలివి. బతుకు తెరువు కోసం కులవృత్తి తప్ప వేరే దారి లేని అమాయక పేదలు. అందమైన అనేక రకాల కుండల్ని తీర్చిదిద్దుతున్నారు కానీ, తమ పేదరికాన్ని మార్చుకోవడం చేత కావడం లేదు. ఆమె పొయ్యిలను తయారు చేస్తున్నది కానీ, పొయ్యిమీద నాలుగు మెతుకులని ఉడికించుకోలేక పోతున్నది.
ఎక్కడున్నారు?
సంగారెడ్డి జిల్లా, కోహిర్‌ మండలం,బిలాల్‌పూర్‌ గ్రామంలోని జీవన చిత్రమిది.అక్కడి కుమ్మరి వృత్తిలో బతుకుతున్న వారిలో ఒకరు లలితమ్మ దంపతులు. తమకు తరతరాలుగా వచ్చిన కులవృత్తిని కాపాడుకుండా వ్యవసాయానికి దన్నుగా ఉన్నారు. అయితే కుండల తయారు చేసి అమ్ముకోవడానికి పెట్టుబడి లేక అప్పులు చేస్తున్నారు.వాళ్ల కష్టమంతా వడ్డీలు తీర్చడానికే సరిపోతుంది.
మీరేం చేయాలి?
TS బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా ఇలాంటి కుటుంబాలకు మీరు అండగా ఉండాల్సిన అవసరంఉంది. బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి వారికి సుస్ధిర జీవనోపాధులు కల్పించాలి.సామాజిక తెలంగాణ నిర్మాణంలో బడుగు బలహీన వర్గాల మేధావిగా మీరు చారిత్రక పాత్ర నిర్వహిస్తారని ఆశతో కులవృత్తులను కాపాడతారనే నమ్మకంతో ఈ జీవన చిత్రాన్ని మీ ముందుంచుతున్నాం.
– శ్యాంమోహన్‌,ఎడిటర్‌,రూరల్‌మీడియా-9440595858

Related posts

1 Comment

  1. midoriSt

    I am sure this post has touched all the internet users, its really really good article on building up new webpage.
    [url=https://twitter.com/savvasazonov1]midoriSt[/url]

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *