గొంతెత్తి పాడటానికి గద్దర్ వస్తున్నాడు..

Mohan – a Celebration of Creativity
మోహనరాగం విందాం పదండి…
అదిగో… గొంతెత్తి పాడటానికి గద్దర్ వస్తున్నాడు.
ఎగిరి ఎగిరి పాడటానికి గోరటి వెంకన్న సంసిద్ధుడౌతున్నాడు.
ఆలాపనతో అలరించిడానికి అరుణోదయ రామారావు ఉద్యుక్తుడవుతున్నాడు.
ఇదంతా ఆర్టిస్ట్ మోహన్ కోసం.
డిసెంబర్ 24న మోహన్ పుట్టిన రోజు సందర్భంగా సాంస్కృతిక సంస్థ ‘లెల్లె’ ఒక సంగీత కార్యక్రమం తలపెట్టింది.
24వ తేది సాయంత్రం అయిదు గంటలు తర్వాత బంజారా హిల్స్, రోడ్ నo. 8 లో వున్న ‘సప్తపర్ణి’ లో ఈ సంగీత సంరంభం జరుగుతుంది.
కవులూ, కళాకారులు, కార్టూనిస్టులూ, గాయకులూ, రచయితలూ, పెయింటర్లు, ఉద్యమకారులూ ఈ సభలో పాల్గొంటారు. మరచి పోలేని గజల్ గాయకుడు గోదావరి ఖని జాకబ్ వస్తున్నాడు.

Mohan – a Celebration of Creativity

Mohan – a Celebration of Creativity


గుజరాత్ సంగీత దర్శకుడు దేవల్ మెహతా, ‘పెళ్లి చూపులు’ చిత్ర సంగీత దర్శకుడు వివేక్ సాగర్ లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. 
పెయింటర్ మోషే డయాన్ మురళీగానం, యానిమేటర్ కె. వీ. బడే గులాం ఆలీఖాన్ పాట, లెల్లె సురేష్ ‘మోహన గీతం’ … విని తీర వలసిన అనుభవం.

కవిగాయక ద్వయం సిధార్థ, అనంత్ లు మోహన్ కోసం తేనెలారే స్నేహగీతాలు ఆలపిస్తారు. అరుణోదయ విమల పాట, నళిని ప్రేమ పాట పరిమళపు తుఫానుల్ని రేపుతాయి.
సాహితీ వేత్త లక్ష్మినర్సయ్య బాగా పాడతారని మీకు తెలుసా? ఆయన వస్తున్నాడు గొంతు సవరినిచుకుంటూ…
డప్పు, గిటార్, డోలక్, కీబోర్డ్, తబలా వాయిద్యాల సుతారపు సంగీతం సమ్మోహన పరచనుంది.
మోహన్ కి నచ్చిన పాట, మోహన్ మెచ్చిన పాట, మోహన్ పాడిన పాటలు అందరికీ వినిపించే ఈ మంచి కార్యక్రమ్మాన్ని లెల్లె సురేష్, తాడి ప్రకాష్, కె. రామలింగం, ఆర్టిస్ట్ శ్రీరామ్ కారంకి కలిసి నిర్వహిస్తున్నారు. ప్రక్యాత కధా రచయిత సి. రామ చంద్రారావు ఈ ‘సెలబ్రేషన్ ఆఫ్ క్రియేటివిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నలి గంటి శరత్ బాబ్ మార్లే పాట, కొందరు యువకుల నవతరం పాటలు గుండెను మల్లెల ఊయలలూగిస్తాయి…
Lelle – a cultural ensemble
Phone: 98490 91717

 

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *