నరేగా నిధుల వినియోగంలో AP రెండవ స్థానం

MGNREGA Changes Lives of Rural Andhra Pradesh

ఉపాధిహామీలో దేశంలో మనమే ముందుండాలి

‘నీరు-ప్రగతి’పై టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఉపాధిహామీ పనుల్లో మనరాష్ట్రమే దేశంలో ముందుండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. మంగళవారం ఢిల్లీ నుంచి ‘నీరు-ప్రగతి’ పురోగతిపై రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ఎంపిడివోలు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నరేగా నిధుల వినియోగంలో ప్రస్తుతం నాగాలాండ్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నామని, మన తర్వాత పంజాబ్ మూడో స్థానంలో ఉందంటూ, ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానం చేరుకోవాలన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.4,600కోట్లు వినియోగించుకున్నామని, నరేగా లక్ష్యం రూ.6వేల కోట్లు పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. అప్పుడే వచ్చే ఏడాది అదనంగా మరో రూ.1,000కోట్లు నరేగా నిధులు మనరాష్ట్రానికి మంజూరు అవుతాయనేది గుర్తుచేశారు.

ఆర్ధిక శాఖనుంచి వెంటనే రూ.300కోట్లు విడుదల చేసి ఉపాధిహామీ పనులు కుంటుపడకుండా చూడాలని ఆదేశించారు. ఉపాధిహామీ కింద పనులు సక్రమంగా జరగాలని, అలాగే వేతనం కూడా బాగా అందేలా చేయాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో ఉపాధి హామీ పనులను పరిశీలిస్తానన్నారు. వచ్చే ఏడాదికల్లా రాష్ట్రంలో అన్ని చెరువులు కళకళలాడాలని ముఖ్యమంత్రి అన్నారు. చెరువుల కట్టలు పటిష్టం చేయాలని, వాగులు-వంకలు అభివృద్ది చేయాలని, కర్రతుమ్మ వెంటనే తొలగించి నీటిప్రవాహానికి అవరోధాలు లేకుండా చూడాలని ఆదేశించారు. వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా ఏప్రిల్, మే నెలల్లో పనులు మందకొడిగా జరుగుతాయని కాబట్టి ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉపాధిహామీ పనులు ముమ్మరం చేయాలన్నారు.

దేశానికే కాకుండా ప్రపంచానికే మనరాష్ట్రం నమూనా కావాలనే ఆకాంక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తంచేశారు.

రేపటి కేబినెట్ లో నీరు-ప్రగతి,హవుసింగ్ పై సమీక్ష:

నీరు-ప్రగతి, హవుసింగ్ కార్యక్రమాల పురోగతిపై బుధవారం మంత్రివర్గ సమావేశంలో సమీక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పంట సంజీవని కింద 2,21,000 పంటకుంటల పనులు ప్రారంభించారని, మిగిలిన 3లక్షల కుంటల తవ్వకం పని కూడా వెంటనే ప్రారంభించాలన్నారు. రెయిన్ గన్ టెక్నాలజి, మొబైల్ లిఫ్ట్ ల ద్వారా వర్షాభావం ప్రభావం అధిగమించినట్లే రాబోయేకాలంలో కూడా చర్యలు తీసుకోవాలన్నారు. సిసి రోడ్ల నిర్మాణం ఇప్పటివరకు 3,529 కి.మీ పూర్తి చేశారని, మిగిలిన 1,471 కి.మీ వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 1,782 పంచాయితీలను ఓడిఎఫ్ గా ప్రకటించామని అధికారులు తెలియజేయగా, రాబోయే రెండేళ్లలో అన్నిగ్రామాలు 100% బహిరంగ విసర్జన రహిత (ఓడిఎఫ్)గా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాలలో ఇన్ ప్రాస్ట్రక్చర్ కల్పన వేగవంతం చేయాలన్నారు. పంచాయతీ భవనాలు, అంగన్ వాడి భవనాల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలన్నారు. కరవు ప్రాంతాలలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని, తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త పింఛన్ల అందజేతలో జాప్యం జరగరాదని, ఏవిధమైన అవరోధాలు ఉండకూడదన్నారు. వచ్చేనెల పింఛన్లు కూడా సకాలంలో సక్రమంగా అందించాలన్నారు. గ్రామాలలో వర్మికంపోస్టు పిట్ల తవ్వకంలో నరేగా, పంచాయితీరాజ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పోరేషన్, సెర్ప్ సంయుక్తంగా సమన్వయంగా పనిచేయాలన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్యకార్యదర్శి జవహర్ రెడ్డి, ఆర్ధిక శాఖ కార్యదర్శి సునీత, సీఎంవో సంయుక్త కార్యదర్శి రాజమౌళి, పట్టణాభివృద్ది శాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్, సెర్ప్ సీఈవో కృష్ణమోహన్, హవుసింగ్ డైరక్టర్ కె.వి.రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

1 Comment

 1. japan-community.com

  Thanks for ones marvelous posting! I definitely enjoyed
  reading it, you will be a great author. I will be sure to bookmark your blog and definitely will come
  back in the foreseeable future. I want to encourage you to
  definitely continue your great writing, have a nice evening!

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *