భూమి, ఆకాశాలను సాగు చేస్తున్న అత్తాకోడళ్లు

MGNREGA be refocused towards creating durable assets in agriculture

భూమి, ఆకాశాలను సాగు చేస్తున్న అత్తాకోడళ్లు
పన్నూరు సుంకులమ్మకు రెండెకరాల పొలం ఉంది. కొడుకు, కోడలుతో కలిసి ఆ బంజరు భూమిని అతి కష్టంమీద సాగులోకి తెచ్చింది. వర్షాలు పడినపుడు ఆకు కూరలు, కాయగూరలు పండించేంది. కానీ వాటిమీద వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక ఇతరుల పొలాల్లో పనుల కోసం వెతుక్కునేవారు.
చినుకు నేలను తాకే లోపు ఏదైనా చేయాలి.లేక పోతే కష్టాలు తప్పవనితెలుసుకన్నారీ అత్తాకోడళ్లు. డ్వామా ఆఫీసు చుట్టూ తిరిగి ఉపాధిహామీ పథకం ద్వారా ఒక నీటి నిలువ కుంటను సాధించారు.వానలు పడినిపుడు నిండుతుంది. అవి లేనపుడు బోరుబావి నీటిని ఆ కుంటలోకి ఎక్కించి గ్రావిటీ పద్దతిలో ఉల్లిపంటను సాగులోకి తెచ్చి విద్యుత్‌ని ఆదా చేశారు.

sunkulamma-mgnrega-karnool

sunkulamma-mgnrega-karnool

ఈ పంట వల్ల సుమారు రూ. 70 వేల వరకు ఆదాయం వస్తుంది. కొన్ని ఆకుకూరులు కూడా పండించుకుని చీకూ,చింతా లేకుండా బతుకుతున్నారు. కర్నూల్‌ జిల్లా, దేవనకొండ మండలం, పి.కోటకొండ గ్రాయంలో రోడ్డు పక్కనే ఈ అత్తాకోడళ్లు సాగు చేస్తున్న దృశ్యాన్ని రూరల్‌మీడియా క్యాప్చర్‌ చేసింది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *