Header ad
Header ad
Header ad

MD Sri City congratulates ISRO

GSLV Mark III carrying GSAT-19 communication satellite launches from Sriharikota

ఇస్రో శాస్త్రవేత్తలకు శ్రీసిటీ యం.డీ అభినందనలు

శ్రీసిటీ, జూన్ 5, 2017:- జీ.ఎస్‌ఎల్వీ- మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం అయినందుకు శ్రీసిటీ ఫౌండర్ యం.డీ రవీంద్ర సన్నారెడ్డి హర్షం వెలిబుచ్చారు. ఒక ప్రకటనలో ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. భారీ క్రయోజెనిక్ ఇంజన్లను జయప్రదంగా ప్రయోగించి జీ.శాట్-19 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి పంపడంలో ఘన విజయం సాధించినందుకు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అద్యక్షులు కిరణ్ కుమార్ను, షార్ డైరక్టర్ కునిహి కృష్ణన్ను, అసోసియేట్ డైరక్టర్ బదరీ నారాయణ మూర్తిని మరియూ షార్ ఉద్యోగస్థుల బృందాన్ని అభినందించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ భారీ రాకెట్ ను నిర్మించి, జయప్రదంగా నింగిలోకి పంపడం మనందరికీ గర్వ కారణమని ఆయన పేర్కొన్నారు

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *