అభివృద్ధికి అర్ధం ఇదిగో…

Mathota -A model for sustainable Telangana tribal livelihood

అభివృద్ధికి అర్ధం ఇదిగో…
పేదోడికి పనిహక్కు కల్పించింది ‘నరేగా’ అయితే ఆదివాసీలను రైతులుగా మార్చి వారి బతుక్కి భరోసా నిచ్చింది టీడీఫ్‌. ఈ రెండు పథకాలు సృష్టించిన నిశ్శబ్ద సామాజిక విప్లవాన్ని ఎనిమిదేళ్లుగా రూరల్‌మీడియా రికార్డు చేస్తోంది.
2012లో తట్టేపల్లి(రంగారెడ్డిజిల్లా)లో రైతు కూలీలుగా బతుకుతున్న గన్యానాయక్‌ గిరిజన కుటుంబం బీడు భూమిలో అప్పటి నాబార్డ్‌సీజీఎం మోహనయ్య గారు కొన్ని మామిడి మొక్కలు నాటారు. చేతులకంటిన మట్టిని కడుక్కొని వెళ్లిపోకుండా ప్రతీ మొక్కకు నీరు పెట్టి కాపాడుకోవడానికి ,బోరు,మోటార్‌ సౌకర్యం కల్పించి మరీ వెళ్లారు.

Mathota project inauguration by Nabard CGM at Peddemul Mandal

Mathota project inauguration by Nabard CGM at Peddemul Mandal

సీన్‌ కట్‌ చేయగా ….
మొన్న మేం అదే తండాకు వెళ్లినపుడు మోహనయ్య నాటిన మొక్క చెట్టయి మామిడికాయలతో నిండుగా ఉంది. చేతికందిన బంగిన పల్లి మామిడి పండ్ల తోటలో కూరగాయలు పండిస్తూ సంతోషంగా కనిపించింది గన్యానాయక్‌ కుటుంబం.  రైతు కూలీలు రైతులుగా మారిన అద్భుత జీవన సత్యమిది .
కొన్ని పాదాలుంటాయండీ… అవి అడుగు పెట్టిన చోట పచ్చదనం పరుచుకుంటుంది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *