పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న సినిమా

Google+ Pinterest LinkedIn Tumblr +

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న సినిమా 
………………………………………………………. 
 తెలుగు నాట వందల ప్రేమకథలు సినిమాలుగా వచ్చి ఉండవచ్చు గాక, చారిత్రాత్మక, పౌరాణిక, జానపద చిత్రరాజములెన్నో మనల్ని ముంచెత్తుగాక, గౌతమ్‌ గోష, ్‌ నారాయణమూర్తి, శంకర్‌లాంటి దర్శకులు తెలంగాణ దొరలస్వామ్యాన్ని అక్కడక్కడా తడిమి ఉండవచ్చు కాక, కానీ నిజాం నవాబుల కాలంలో గరీబుల బతుకు చిత్రాన్ని 
ఇంతవరకు ఎవరరూ టచ్‌ చేయక పోవడం మన తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక భయంకరమైన ట్రాజడీ. 
నిజాం పరిపాలనలో ప్రతీ అడుగూ ఒక రక్త చరిత్ర!  
నిజాములు తొత్తులుగా రజాకార్లు చేసిన అరాచకాలు, వాటి పై తెలంగాణ బిడ్డల తిరుగుబాటును ఒక ఆసక్తికరమైన మలుపుతో తొలిసారిగా ఒక సినిమా తయారైంది. 
హైదరాబాద్‌ సంస్థానాన్ని నిజాం నవాబులు పాలిస్తున్న కాలంలో రజాకార్ల సాగించిన దుర్మార్గాలకు కేస్‌ స్టడీ ‘రజాకార్‌’ సినిమా. ఇటీవల విడుదలైంది. కానీ ఈ సినిమా గురించి తెలంగాణ ప్రజలకు తెలియదు. ఎందుకంటే తెలంగాణ చరిత్రలోని ఒక చీకటి కోణాన్ని తెర మీదకు తెచ్చింది మరాఠీ దర్శకుడు రాజ్‌దుర్గే.   
‘రజాకార్‌’ మహారాష్ట్రలో విడుదలైనపుడు సంచలనమేమీ సృష్టించ లేదు కానీ చాలా మందిని ఆకట్టుకుంది. సిద్దార్ధ జాదవ్‌ నటన చూసి తీరాలి. ఈ సినిమా ముగింపు ప్రేక్షకులకే వదిలేయడం కొంత నిరాశ కలిగించినప్పటికీ తెలంగాణ చరిత్రపై కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఈ ఫిల్మ్‌ యూనిట్‌ని అందరూ అభినందిస్తున్నారు. ముఖ్యంగా మనం తీయాల్సిన సినిమాని పక్క రాష్ట్రం వారు తీశారే అనే బాధ కలుగుతుంది. ఇప్పటికైనా మన దర్శకులు కమర్షియల్‌ ఫార్ములా నుండి బయట పడి ‘రజాకార్‌’ వైపు చూడవచ్చు.  ఈ సినిమాను ” నైజాం సర్కరోడా ” పేరుతో తెలుగులోకి డబ్బింగ్‌ చేసే ప్రయత్నం జరుగుతోంది కానీ , ఇంతకంటే బాగా కొత్త సినిమాను తీయడమే మంచిది.

Share.

Leave A Reply