మౌంట్‌ ఆబూ… చూసి తీరాలి బాబూ

Mount Abu, Aravalli Range

మౌంట్‌ ఆబూ… చూసి తీరాలి బాబూ
………………………………………………
ఆదొక కొత్త బంగారు లోకం. ఆరావళి కొండల మీద పక్షులతో పాటు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేస్తుంది.
కొందరు వజ్ర మందిరంలో, మరికొందరు తివాచీలా పరుచుకున్న పచ్చక బయళ్లలో కూర్చొని ధ్యాన ముద్రలోకి వెళ్లిపోతారు.
పరిశుభ్రంగా అద్దంలా మెరుస్తున్న రహదారులు, ఇరువైపుల పచ్చని చెట్లు వాటిని నీళ్లు పోస్తున్న పని వారు, వృద్దులకు చేయూతనిచ్చి రోడ్డుదాటిస్తున్న యువతులు. చెట్లనీడలో సిమెంట్‌ బెంచీమీద కూర్చొని ముచ్చట్లాడుతున్న పశ్చిమ దేశాల జంట, పార్కులో ఏర్పాటు చేసిన ఊయల పై ఊగుతూ, పుస్తకాలు చదువుతున్న యువకులు.
అందరిలోనూ ఒక తేజస్సు, నిర్మలమైన చూపులు, ప్రేమపూర్వకమైన పలకరింపులు.
జ్వరంవచ్చినా దగ్గు వచ్చినా అప్యాయంగా ఓ చేయి మీ ముందుకు వచ్చి తల నిమిరి మందులిస్తుంది..

Mount Abu, Aravalli Range

Mount Abu, Aravalli Range

దాహం వేస్తే అడుగడుగునా మినరల్‌ వాటర్‌ సెంటర్‌లు…
మన పక్కనుండి నెమ్మదిగా వెళ్లే కాలుష్యరహిత ఇ బైక్‌లు, సైకిళ్లు.
మరో వైపు విశాలమైన డైనింగ్‌ హాలులో పాలకూరతో కలిపి చేసిన రోటీల మధ్య కాకరకాయ వేపుడు,క్యాబేజీ వడ్డించుకొని ప్రశాంతంగా వేలాది మంది బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తుంటారు. మరోవైపు సౌరవిద్యుత్‌తో ఆవిరి పొయ్యిల పై లంచ్‌ కోసం వంటలు వండుతూ ఉంటారు.
అక్కడున్నంత సేపూ మనలో గూడుకట్టుకున్న మానసిక సమస్యలు అదృశ్యమై ఒక ఆధ్యాత్మిక పరిమళం అలుముకుంటుంది.
అదొక ఆధ్యాత్మిక, సామాజిక ,లౌకిక ,చైతన్య ప్రపంచం.

Mount Abu, Aravalli Range

Brahmakumaris,
Mount Abu, Aravalli Range

దాని పేరు ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. రాజస్ధాన్‌లోని ఆరావళి పర్వతాల మధ్య మౌంట్‌ ఆబూలో ఉంది. ఎడారిలో వెలిసిన ఈ ఒయాసిస్సును చూడడానికి ప్రపంచం వ్యాప్తంగా వేలాది మంది వస్తుంటారు. మహిళల యొక్క , మహిళలచే నిర్వహిస్తున్న విశ్వమహిళా చైతన్య రాజ్యమిది…
హేమంత రుతువులో నాలుగు రోజులు అక్కడ గడిపితే మనసు రీచ్ఛార్జి అవుతుంది.
అక్కడ ధ్యానాన్ని ఒక పనిగా చేయరు, ప్రతీ పనిని ఒక ధ్యానంగా చేస్తారు.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *