పదకొండేండ్ల రైతుల కల

mahatma-gandhi-kalwakurthy-lift-irrigation-lift-2jonnalabodda-mahabubnagar

పదకొండేండ్ల రైతుల కల నిజమయింది

మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్‌ఐ) నిర్మాణం పూర్తవడంతో పదకొండేండ్ల రైతుల నిరీక్షణకు తెరపడింది. 3.6 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు గత ప్రభుత్వాలు చేపట్టిన భారీ లిఫ్టుల్లో ఇదొకటి. 2005లో పనులను ప్రారంభించగా, 2014 వరకు పూర్తి చేయలేదు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కేవలం రెండేండ్లలో భారీగా నిధులు కేటాయించింది. పాలమూరు జిల్లా పచ్చబడాలనే సంకల్పం తో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికోసం నడుంబిగించింది. పనులు వేగవంతం చేసేందుకు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తరచూ సందర్శించి సమీక్షలు నిర్వహించడంతోపాటు ప్రాజెక్టు నిద్రచేశారు. ఈ ఖరీఫ్‌లో నిర్ణీత ఆయకట్టుకు నీరిచ్చేందుకు సిద్ధమయ్యారు. నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు జొన్నలబొగుడ లిఫ్ట్ -2, గుడిపల్లి లిఫ్ట్-3ని ప్రారంభించనున్నారు. నాలుగు రోజులుగా ఇంజినీరింగ్ అధికారులు లిఫ్ట్-3 వద్ద ట్రయల్న్ చేస్తున్నారు. పనులు విజయవంతం కావాలని లిఫ్ట్ వద్ద మొదటిరోజు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌డ్డి హోమం చేశారు. ఈ లిఫ్ట్ ద్వారా 2.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఎంజీకేఎల్‌ఐ మూడుస్థాయిల్లో ఎత్తిపోతల పూర్తి కావడంతో ఇన్నాళ్లుగా సాగునీటికి తల్లడిల్లిన పాలమూరు రైతన్నల కల సాకారం కానున్నది. మూడు లిఫ్టుల్లో భాగమైన లిఫ్ట్-1 (ఎల్లూరు) 2012లో అందుబాటులోకి వచ్చి 13వేల ఎకరాలకు నీరందిస్తున్నది. ప్రస్తుతం ఈ లిఫ్ట్ నుంచి జొన్నలబొగుడ (లిఫ్ట్-2)కు నీటిని గ్రావిటీ ద్వారా తరలిస్తారు. లిఫ్ట్-1లోని శ్రీవారిసముద్రం (సింగోటం) నుంచి నీటిని తీసుకునే విధంగా రూపొందించిన లిఫ్ట్-2 (జొన్నలబొగుడ)కు సంబంధించిన పనులు పూర్తికావడంతో గత నెల 29న ట్రయల్న్ పూర్తి చేసి, లిఫ్ట్-3కి నీటిని పంపింగ్ చేస్తున్నారు.

mahatma-gandhi-kalwakurthy-lift-irrigation-lift-2jonnalabodda

mahatma-gandhi-kalwakurthy-lift-irrigation-lift-2jonnalabodda

శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి రేగుమాన్‌గడ్డ వద్ద 820 మీటర్ల లెవెల్‌లో అప్రోచ్ కెనాల్ ద్వారా లిఫ్ట్-1 సర్జిపూల్‌లోకి నీరు చేరుతుంది. పంపుహౌస్‌లోకి చేరిన నీటిని 30 మెగావాట్ల విద్యుత్‌శక్తి కలిగిన ఐదు మోటార్ల ద్వారా 95 మీటర్ల ఎత్తున ఉన్న కాల్వలోకి ఎత్తిపోస్తారు. ఈ నీరు ఎల్లూరు జలాశయంలోకి, అక్కడి నుంచి శ్రీవారిసమువూదానికి చేరుతుంది. ఈ లిఫ్ట్ కింద 13 వేల ఎకరాలకు సాగునీరందుతున్నది. ఎల్లూరు జలాశయం నుంచి కొల్లాపూర్ సెగ్మెంట్ మిషన్‌భగీరథకు తాగునీటిని తీసుకునేందుకు ప్రస్తుతం జలాశయం ఒడ్డున ఫిల్టర్‌బెడ్ల పనులు కొనసాగుతున్నాయి. ఎల్లూరు రూ.495.20 కోట్లతో చేపట్టగా, ఈ లిఫ్ట్‌ను 2012 సెప్టెంబర్ 16న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ప్రారంభించారు. శ్రీవారిసముద్రం నుంచి అండర్ టన్నెల్ ద్వారా లిఫ్ట్-2కు నీటిని తీసుకుంటారు.

జొన్నలబొగుడ లిఫ్ట్-2 :

రూ.649.90 కోట్లతో చేపట్టిన జొన్నలబొగుడ లిఫ్ట్-2కు 2012 డిసెంబర్ 5న నాటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య శంకుస్థాపన చేశారు. 46 వేల ఎకరాలకు నీరందించే ఈ లిఫ్ట్ ట్రయల్న్ గత నెల 29న పూర్తి కావడంతో జలాశయంలో నీటిని నిల్వ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో లిఫ్ట్ పనుల్లో అనేక అవాంతరాలు ఎదురవగా, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుగా ఒక పంపు నుంచి సాగునీరివ్వాలని నిర్ణయించి అందుబాటులోకి తెచ్చారు. జొన్నలబొగుడ నుంచి గుడిపల్లి వెళ్లే 120 కిలోమీటర్ల పొడవున్న బ్రాంచ్ కెనాల్‌కు మూడుకిలోమీటర్ల దూరంలోని పస్పుల వద్ద కాల్వ మార్గం మార్చుకుని పస్పుల, బావాయిపల్లి, కోడేరు, జనుంపల్లి, నాగులపల్లి, ముత్తిడ్డిపల్లి, కదిపాడు మీదుగా పాన్‌గల్ మండలంలో 35వేల ఎకరాలకు సాగునీరు చేరుతుంది. జొన్నలబొగుడ స్లూయిస్ గేట్ల నుంచి 15 కిలోమీటర్ల పొడవు గల మరో కాల్వ పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ, సాసాపూర్, కొత్తపేట, చెన్నాపూరావుపల్లి, కల్వకోలు, తిర్ణాయపల్లి మీదుగా 12వేల ఎకరాలకు నీరందిస్తుంది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *