శ్రీసిటీలో ‘ఐఆర్ఎంఆర్ఏ టెస్టింగ్ ల్యాబ్’

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రీసిటీ, ఫిబ్రవరి 15, 2018:- కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రబ్బర్ మ్యానుఫ్యాక్చరర్స్ రీసెర్చ్అసోసియేషన్ (ఐఆర్ఎంఆర్ఏ) కు సంబందించిన అధునాతన వస్తు మరియు ఉత్పత్తుల టెస్టింగ్ ల్యాబ్ ను గురువారం శ్రీసిటీలోప్రారంభించారు. ఐఆర్ఎంఆర్ఏ ప్రెసిడెంట్, మరియూ జి ఆర్ పి లిమిటెడ్ ఎండి రాజేంద్ర వి గాంధీ లాంఛనంగా దీనిని ప్రారంభించగా, ఐఆర్ఎంఆర్ఏ డైరెక్టర్ రాజ్ కుమార్, ఇతర కౌన్సిల్ సభ్యులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ, అద్భుతమైన సౌకర్యాలు, శ్రీసిటీ యాజమాన్యం  సహకారం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సులభతరవ్యాపార నిర్వహణ తదితర అంశాలు తమ   శాఖను   శ్రీసిటీలో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణమన్నారు. దక్షణ భారతదేశంలోనిఆటోమొబైల్, టైర్ మరియు రబ్బర్ ఉత్పాదక రంగాలవారికి   తమ   శ్రీసిటీ ల్యాబ్ చాలా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.

.తమ ల్యాబ్ ను శ్రీసిటీలో స్థాపించినందుకు ఐఆర్ఎంఆర్ఏ బృందానికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన  అభినందనలుతెలిపారు. శ్రీసిటీలో ఇది మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ  అని, . ఈ ప్రాంతం ఆటోమొబైల్ హబ్ గా మారుతున్న నేపధ్యంలోశ్రీసిటీలోని ఆటోమొబైల్ పరిశ్రమవర్గాలకు  ఐఆర్ఎంఆర్ఏ  ఎంతో ప్రయోజనం చేకూర్చగలదని  అన్నారు.

ఈ ల్యాబ్ లో ప్రస్తుతం 25 కోట్ల పెట్టుబడితో యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ (యు టి ఎం), మూనీ విస్కో మీటర్, మూవింగ్ డై రియో మీటర్ (ఎండి ఆర్), డిజిటల్ హార్డనెస్ టెస్టర్ వంటి  పలు అధునాతన పరికరాలను ఏర్పాటు చేశారు. త్వరలో టైర్ టెస్టింగ్ సౌకర్యం కూడా అందుబాటులోకితీసుకురావడం జరుగుతుంది.

ఇక్కడ ప్రస్తుతం 20 మంది  ఉద్యోగులుoటారని,  రెండేళ్లలో  ఈ సంఖ్య  వందకు చేరుకుంటుందని,  అలానే  వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధిలభించగలదని ఐఆర్ఎంఆర్ఏ  అధికారి ఒకరు చెప్పారు. .

గత ఆరు దశాబ్దాలుగా  ఐఆర్ఎంఆర్ఏ పరీక్షలు, పరిశోధనలు, రీసెర్చ్ అండ్ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్, ట్రైనింగ్ & మ్యాన్పవర్ డెవలప్మెంట్,కన్సల్టెన్సీ సర్వీసెస్ రంగాలలో మంచి  నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సేవలందిస్తోంది. పలు జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల నుండి పలుగుర్తింపు ధృవపత్రాలను ఇది దక్కించుకుంది.

దేశంలోని ప్రఖ్యాతిగాంచిన ఆటోమొబైల్ కంపెనీలు,   టైర్ల తయారీ కంపెనీలు, అనేక   ప్రభుత్వ, ప్రైవేట్  పరిశోధనా సంస్థలు  ఐఆర్ఎంఆర్ఏసేవలు పొందుతున్నాయి. (C. RAVINDRANATH)

Share.

Leave A Reply