రూరల్‌ మీడియా రిపోర్ట్ పై ప్రభుత్వ స్పందన

I&PR Rejoinder to ruralmedia news report

ఇటీవల మేం ‘పెదలబుడు’ క్షేత్రపర్యటన చేసి
‘ సీఎం దత్తత గ్రామంలో ఏం జరుగుతోంది?’ ‘ పెదలబుడు గుండె చప్పుడు ‘ అనే రెండు ఫీచర్‌ స్టోరీలను ప్రచురించినపుడు వీక్షకులతో పాటు ప్రభుత్వ అధికారులు నుండి కూడా అనూహ్య స్పందన వచ్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖ రిజాయిండర్‌ పంపారు.మా సమగ్రకథనానికి, సూచనలకు వారిచ్చిన సమాధానాలు ఇవి…

1, ఆరోగ్య కేంద్రం ఎక్కడా?
వివరణ:
వార్త: 11,000 జనాభా కలిగిన పెదలబుడు పంచాయతీ కి కనీసం ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రము కూడా లేదు  కేవలం ఒక ఆరోగ్య ఉప కేంద్రం మాత్రమే వుంది.
•    పెదలబుడు పంచాయతీ పరిధిలో  మూడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు (1.గన్నెల,2.మడగడ 3.సుంకరమెట్ట ) మరియు ఏడు ఆరోగ్య ఉప కేంద్రాలు అక్కడ గిరిజనులకు వైద్య సదుపాయాలు అందిస్తున్నాయి.
•    పై మూడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ భవనాలను కలిగివున్నాయి. పెదలబుడు పంచాయతీ పరిధిలో గల ఏడు ఆరోగ్య ఉప కేంద్రాలకు గాను నాలుగు ఆరోగ్య ఉప కేంద్రాలు ప్రభుత్వ భవనాలను కలిగి వున్నాయి అందులో  ఒక ఆరోగ్య ఉపకేంద్రం నిర్మితమై ప్రారంభానికి సిద్దంగా వున్నది.
•    పెదలబుడు పంచాయతీ పరిధిలో గల ఏడు ఆరోగ్య ఉప కేంద్రాలలో ఏడుగురు ఎం.పి.హెచ్.ఎ.(ఎఫ్),ఆరుగురు ఎం.పి.హెచ్.ఎ.(ఎం),ఇద్దరు సెకెండ్ ఏ.ఎన్.ఎం.లు వైద్య సేవలను అందిస్తున్నారు.
పెదలబుడు పంచాయతీ పరిధిలో వున్న గ్రామాలలో చివరి గ్రామం కమ్యునిటీ హెల్త్ సెంటర్ అరకువాలీ కి గరిష్టంగా పది కిలోమీటర్ల దూర౦లోనే వున్నది.
2, మూత పడిన బడి 
పెదలబుడు పంచాయితీ పరిధిలోని లిట్టిగూడ గ్రామంలోని ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్‌ ఇటీవల మూతపడింది.
వివరణ:
అరకు వాలీ మండలం పెదలబుడు గ్రామ పంచాయతీ లో గల ప్రాధమిక పాఠశాల ఎం.పి.స్. లిట్టిగుడ ను ప్రభుత్వ ఆదేశాల మేరకు పాజిటివ్ పాఠశాలలో విలీనం చేసి పిల్లలకు మంచి విద్య ను అందించుటకు ఎం.పి.స్. పానిరంగిణి పాఠశాలకు కలిపిరి. గ్రామస్తులు పిల్లలు అందుకు అంగీకరించనందున పాడేరు పి.ఓ. (ఐ.టి.డి.ఎ.) గారు విశాఖపట్నం జిల్లా విద్యాధికారి వారి ఆదేశాలు మేరకు తే. 20.06.2016 న ఎం.పి.స్. లిట్టిగుడను తిరిగి పునః ప్రారంభిoచుట జరిగినది. వెంటనే నాడు ఒక ఉపాధ్యాయురాలిని నియమించితిమి. ప్రస్తుతం ఆ  పాఠశాలలో 19 మంది విద్యర్తినివిద్యార్ధులు చదువుతున్నారు. నాటి నుండి నేటి వరకు ప్రతిరోజూ ఆ పాఠశాల చక్కగా పనిచేస్తుంది. సాక్షాతూ జిల్లా విద్య శాఖ అధికారి శ్రీ. యస్. వి. కృష్ణా రెడ్డి మరియు డి.వై.ఇ.ఓ కె. సువర్ణ గారు జూలై 2016 లో సందర్శించిరి.
3, తాగునీటికి కటకట
పెదలబుడు లో 3,116 కుటుంబాలు బతుకుతున్నాయి కానీ రోజూవారీ అవసరాలకు తగినంత నీటిసరఫరా లేదు.
వివరణ:
పెదలబుడు గ్రామము లో 27 లక్షల రూపాయల అంచనాతో SVS Scheme కింద్ర Bore Well త్రవ్వకము, పంపింగ్, విధ్యుత్ సరపరా, పూర్తి కాగా నీటి కుళాయిలు మరియు నీటి సరపరా యెక్క పనులు జరుగుతున్నవి. ఈ నెల ఆఖరి నాటికీ పూర్తి కాగలవు.
గరుడగుడ గ్రామం లో 18 లక్షల రూపాయల అంచనాతో SVS Scheme కింద్ర Bore Well త్రవ్వకము, పంపింగ్, విధ్యుత్ సరపరా, పూర్తి కాగా నీటి కుళాయిలు మరియు నీటి సరపరా యెక్క పనులు జరుగుతున్నవి. డైరెక్ట్ పంపింగ్ ద్వార నీటి సరపరా జరుగుతుంది. ఈ పనులు ఈ నెల ఆఖరి నాటికీ పూర్తి కాగలవు.
గంజయేగుడా గ్రామం 7.5 లక్షల రూపాయల అంచనాతో SDP Grant కింద్ర  SVS Scheme పనులు పూర్త అయ్యాయి. 4  పబ్లిక్ స్టాండ్ పోస్ట్ ద్వార నీరు విడుదల చేయబదినది మరియు 100% service deliveries నిమిత్తము 8  లక్షల రూపాయల కావలిసి వున్నది.
పెదలబుదు గ్రామా పంచాయతి లో 22 శివారు గ్రామములలో ప్రతి ఇంటికి మంచి నీటి ని అందిచాలనే ఉద్దేశ్యం తో 14  శివారు గ్రామములలో 14 మంచి నీటి పధకములు  NRDWP (TSP) పతాకములో 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి 7 గ్రామములలో 7  మంచి నీటి పాతకములు మంజూరు చేయడము ద్వార నీరు సరపరా చేస్తూ 7  గ్రామములలో 7 మంచి నీటి పదకమలు ఫిబ్రవరి మాసము చివరకు పూర్తి చేయటకు నిర్దేశించడం మైనది మరియు 8 శివారు గ్రామములలో 8 మంచి నీటి పదకములు SDP పధకము లో మంజూరు చేసి 7  మంచి నీటి పదకములు పూర్తి చేసి మంచి నీటి సరపరా చేస్తూ ఒక గ్రామములో 1 మంచి నీటి పధకము ఫిబ్రవరి మాసము చివరకు పూర్తి చేయుటకు నిర్దేశించడం మైనది.
4, పారిశుద్ధ్యం పై చిత్తశుద్ధి లేదు
పెదలబుడులో అతిపెద్ద సమస్య పారిశుద్ధ్యం. గ్రామంలో అడుగు పెడితే ఎక్కడ చెత్త అక్కడే కనిపిస్తుంది. మురుగు నీటి పారుదల వ్యవస్ధలేదు. చినుకు పడితే చిత్తడే.
వివరణ:
A.  పెదలబుడు గ్రామపంచాయతీలో గల అరకువ్యేలీ పర్యాటక ప్రాంతము అగుటచే చెత్త ఎక్కువగా రోడ్లపై విసిరివేయబడుచున్నది. సదరు చెత్తను సేకరించి దాని ద్వారా సంపదను ఉత్పత్తి చేయుటకు గాను గ్రామీణ ఉపాధి హామీ పధకం యొక్క నిధులతో ఒక ఘన,వ్యర్ధ పదార్ధముల నుండి సంపద తయారీ కేంద్రమును నిర్మించుటకు పరిపాలనామోదము తీసుకొనుట జరిగినది. గ్రామ సర్పంచ్ వారు ఈ పనిని చేపట్టితిరి. ఉపాధి హామీ వేతనదారుల ద్వారా వేతనమునకు సంబంధించిన పని పూర్తి కావింపబడినది. నిర్మాణపు పనులు సర్పంచ్ వారు పూర్తి చేసియున్నారు.కేవలము పైకప్పు కల్పించవలసియున్నది.ఆమోదము పొందిన తాటి ఆకు పైకప్పునకు బదులు రేకులతో పైకప్పు కల్పించుటకు  ప్రతిపాదనలు తయారు చేయుట జరుగుచున్నది.
B.    వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణము :
పెదలబుడు గ్రామపంచాయతీ పరిధిలో 2581 గృహములు కలవు. వీటి యందు స్వచ్చ భారత్ కార్యక్రమము ప్రారంభింపక ముందు 1391 గృహములకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండేవి.గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దత్తత తీసుకున్న తరువాత మిగిలిన 1190 గృహములకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణము గావించుటకై ఎస్టిమేట్లను తయారుచేసి పరిపాలనామోదము మంజూరు చేసి 798 మరుగుదొడ్లను పూర్తిగా నిర్మించుట జరిగినది. మిగిలిన 392 మరుగుదొడ్ల నిర్మాణము వివిధ దశలలో ఉన్నది. వీటి నిర్మాణము మార్చి నెల 15 వ తారీకు లోగా పూర్తిగా కావింపబడును.

5, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు నిరాశకు లోనై బతుకు తెరువు కోసం వలసలు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరికి వెంటనే ఉద్యోగాలు కల్పించక పోయినప్పటికీ, వారి అర్హతలకు తగిన నైపుణ్యం పెంచుకునే శిక్షణను ఇచ్చే కేంద్రాన్ని అరకులో ఏర్పాటు చేయాలి.
వివరణ: 
299 నిరోద్యగా యువతను గుర్తించడం జరిగినది. వారిలో 53 మందికి శిక్షణ ఇచ్చినారు. వారిలో 41  మందికి వివిధ ఉద్యోగ కల్పన జరిగినది. అవి      CRPF –Sporty                 :    6
English Work Redness          :    1
IGIAT Electrician            :    2
IGIAT Tally                 :    1
CIPET-MO-PP                :    3
NAC – Tribal Contractor Development
Training                         :    1

మిగిలిన వారికీ వివిధ రంగాలలో శిక్షణా కార్యక్రమము 14-01-2017  నుంచి ప్రారంబించబడినది.

6, కొండ ప్రాంతంలో తరచూ ఈదురు గాలులు వీచి విద్యుత్‌ ఆగి పోతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా సోలారు వీధి లైట్లు వేస్తే విద్యుత్‌ని పొదుపు చేయవచ్చు. అవసరమైతే ఇంటింటికి సోలార్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేయవచ్చు.
వివరణ:
పెదలబుడు గ్రామా పంచాయతీ మెత్తము నకు గ్రిడ్ కనెక్టివిటీ సరపరా కలదు. అక్కడ విద్యుత్ కనెక్షన్స్ కొరత లేదు. గ్రామా పంచాయతీ నిధులు ద్వార వీధి సౌర విద్యుత్ దీపములు అమర్చబదినడివి.

7,  పెదలబుడు జనాభాలో 5,185 మంది మహిళలే. వీరిలో 1,625 మంది స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు. వీరికి పలు వృత్తుల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం కల్గించాలి. ఆర్గనిక్‌ పంటల సాగు పై వారికి అవగాహన కల్గించాలి.
వివరణ:
పెదలబుడు గ్రామా పంచాయతి పరిధి లో 1625  మంది స్వయం సహాయక సంగ సభ్యులుకు పలు వృత్తిలలో శిక్షన  ఇచ్చి ఉపాధి కల్పించట లో వెలుగు సిబ్బంది ద్వార సర్వే చేసి శిక్షన ఇచ్చి స్వయం ఉపాది కల్పించడము ద్వార  వారి లో ఆత్మ విశ్వాసము కల్పించుటకు తగు చర్యలు తెసుకోనబడుచున్నవి.
ఆర్గానిక్ / ప్రకృతి పంటల సాగు ఫై అవగాహనా కల్పిపించు నిమిత్తం స్వయం సహాయక సంగ సభ్యులుకు మరియు రైతులుకు వ్యవసాయ శాఖ/ ఉద్యాన వన శాఖ  ద్వార  బహుళ ప్రయోజనకర  విస్థానాదికారణ  నియమించదమైనది.
8,  విద్యార్ధుల సంఖ్య తక్కువ ఉందనే కారణంతో పాఠశాలలు మూయడం సరికాదు. దీని వల్ల 2కిలో మీటర్లకు పైగా పిల్లలు నడిచి వేరే బడికి పోవాల్సిన పరిస్ధితి ఏర్పడి వందలాది పిల్లలు చదువు మానేస్తున్నారు. ఈ సమస్యను నివారించాలంటే విద్యార్ధులను ఆటోల ద్వారా స్కూల్‌కి చేరుకునే సౌకర్యం కల్పించాలి. లేదా పంచాయితీ పిల్లలందరికీ ఒకే చోట చదువు అందేలా హాస్టల్‌ వసతి కల్పించాలి.
వివరణ:
అరకు వాలీ మండలం పెదలబుడు గ్రామ పంచాయతీ లో గల ప్రాధమిక పాఠశాల ఎం.పి.స్. లిట్టిగుడ ను ప్రభుత్వ ఆదేశాల మేరకు పాజిటివ్ పాఠశాలలో విలీనం చేసి పిల్లలకు మంచి విద్య ను అందించుటకు ఎం.పి.స్. పానిరంగిణి పాఠశాలకు కలిపిరి. గ్రామస్తులు పిల్లలు అందుకు అంగీకరించనందున పాడేరు పి.ఓ. (ఐ.టి.డి.ఎ.) గారు విశాఖపట్నం జిల్లా విద్యాధికారి వారి ఆదేశాలు మేరకు తే. 20.06.2016 న ఎం.పి.స్. లిట్టిగుడను తిరిగి పునః ప్రారంభిoచుట జరిగినది. వెంటనే నాడు ఒక ఉపాధ్యాయురాలిని నియమించితిమి. ప్రస్తుతం ఆ  పాఠశాలలో 19 మంది విద్యర్తినివిద్యార్ధులు చదువుతున్నారు. నాటి నుండి నేటి వరకు ప్రతిరోజూ ఆ పాఠశాల చక్కగా పనిచేస్తుంది. సాక్షాతూ జిల్లా విద్య శాఖ అధికారి శ్రీ. యస్. వి. కృష్ణా రెడ్డి మరియు డి.వై.ఇ.ఓ కె. సువర్ణ గారు జూలై 2016 లో సందర్శించిరి.

9, వర్షాధార పంటల మీదనే రైతులు ఆధార పడుతున్నారు కాబట్టి పండ్లతోటలు,కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించాలి. బోర్లు, డ్రిప్‌ ఇరిగేషన్‌ సదుపాయాలు కల్పించాలి. సకాలంలో విత్తనాలు అందేలా చేయాలి.
వివరణ: 
ఎన్.టి.ఆర్.జలసిరి పధకములో భాగముగా గ్రామములో గల ప్రతీ అర్హత గల రైతుల నుండి ప్రతిపాదనలు కోరబడినవి.మొత్తం సమర్పింపబడిన 46 ధరఖాస్తులు భూగర్భజల శాఖకు సర్వే నిమిత్తం పంపబడినవి. సదరు భూములు యొక్క నీటి లభ్యత కొరకు సర్వే జరపబడుచున్నది. నీటి లభ్యతను భూగర్భజల శాఖ ద్వారా నిర్ధారణ కాబడిన వెంటనే బోరుబావుల త్రవ్వకం చేయు సంస్థలచే బోరుబావులను త్రవ్వించుట చేపట్టబడును.బోరుబావి యొక్క లోతును అనుసరించి సౌరవిద్యుత్ తో పనిచేసే మోటారులను గాని లేదా విద్యుత్ ద్వారా పనిచేసే మోటారులను గాని లబ్దిదారులకు సరఫరా చేయుట జరుగును. తద్వారా వర్షాధార భూములకు వ్యవసాయమునకు కావలసినంత  నీటి సరఫరా కల్పింపబడును.  పండ్ల తోటలు / కూర గాయాలు పంపకాని ప్రాత్సాహించాలిని ఉద్దేశ్యం తో  వ్యవసాయం మరియు ఉద్యాన వన శాఖ ద్వార  రైతుల కు రాయితీలు కల్పించు చు ప్రకృతి వ్యవసాయం ఫై అవగాహనా కల్పిస్తూ NTR JALASRI  ద్వార బోరు బావులు త్రవ్వించుట  మరియు  APMIP  ద్వారా DRIP IRRIGATION  సదుపాయం కలిగించు చున్నాము. వ్యవసాయం మరియు ఉద్యాన వన శాఖల ద్వారా  సగం దర  subsidy  ఫై విత్తనాలు సరపరా చేయబడుచున్నవి.

10, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్‌ కార్డులున్న వారు 1551మాత్రమే. ఇంకా ఉపాధి పనుల కోసం 2293 మంది ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఉపాధి పనులు కల్పించి జీవనో పాధులు మెరుగుపర్చాలి.
వివరణ: 
పెదలబుడు గ్రామపంచాయతీలో నేటి వరకు 1551 జాబ్ కార్డులు ఇవ్వబడినవి. వీరిని 148 శ్రమ శక్తి సంఘాలుగా ఏర్పరచి ఈ జాబ్ కార్డుల యందు గల 2494 మంది వేతనదారులకు పని కల్పించటం జరుగుచుయున్నది.ఈ ఆర్ధిక సం.లో నేటి వరకు 2396 మందికి ఉపాధి హామీ పధకంలో పని కల్పించబడినది. తద్వారా నేటి వరకు 89,608 పని దినములు కల్పింపబడినవి మరియు 300 కుటుంబములకు 100 రోజుల పని కల్పించడమైనది.162.42 సగటు వేతనము మరియు  74.74 సగటు పనిదినములు కల్పించడం జరిగినది. మార్చి 31 వ తేదీ లోగా మిగిలిన అన్ని జాబ్ కార్డుల యందు ఉన్న వేతనదారులకు పని కల్పించి ప్రతి కుటుంబమునకు 100 రోజులు పని కల్పించుట ధ్యేయముగా చర్యలు తీసుకొనబడుచున్నవి.

11, పెదలబుడు పంచాయితీ పరిధిలో 1,589.51 ఎకరాల బంజరు భూమి ఉంది. గ్రామీణ ఉపాధి హామీపథకం ద్వారా ఈ పోరంబోకు భూమిని అభివృద్ధి చేసుకోవచ్చు. వాటర్‌ షెడ్‌ ద్వారా రాతికట్టలు,చెక్‌డ్యాంలు నిర్మించి వాన నీటిని ఒడిసిపట్టవచ్చు. నాబార్డు గిరిజనాభివృద్ధి నిధి ద్వారా పండ్లతోటలు పెంచి తద్వారా వచ్చే ఆదాయంతో పంచాయితీని మరింత తీర్చిదిద్ద వచ్చు.
వివరణ:
పెదలబుడు పంచాయతీ లో గ్రామీణ ఉపాధి హామీపథకం ద్వారా 34 చెక్ డ్యాం మరమ్మత్తులు, నూతన నిర్మాణాలు, 454.00 లక్షలు జిల్లా కలెక్టరు వారి ఆమోదముతో మంజూరు అయినది. దీని ద్వారా 380 ఎకరాలు స్థిరీకరించబడును. సదరు పనులు పురోగతిలో ఉన్నవి.
నీరు చెట్టు పధకం క్రింద 4 నీటి నిల్వ కట్టడముల పనులు , రూ. 36.00 లక్షలు జిల్లా కలెక్టరు వారి ఆమోదముతో మంజూరు అయినవి. దీని ద్వారా భూగర్భ జలాలు మెరుగు పడును. సదరు పనులు పురోగతిలో ఉన్నవి.
బంజరు భూములను అభివృద్ధి చేయుటకై ఉపాధి హామీ పధకంలో నేటి వరకు 964 పనులకు ఎస్టిమేట్ లు వేయబడి 786 పనులకు 28 కోట్ల 30 లక్షల రూపాయల అంచనావిలువలకు గాను  పరిపాలనామోదము మంజూరు చేయబడి 555 పనులను 5 కోట్ల 43 లక్షల రూ.లతో పూర్తి చేయబడినవి. ఇంకనూ 40 పనులు వివిధ దశలలోయున్నవి. 5 రాతికట్టడము పనులను గుర్తించి 84 లక్షల 76 వేల రూపాయలతో పరిపాలనామోదము మంజూరు చేయగా 3 పనులు వివిధ దశలలో ఉన్నవి. నేటి వరకు వీటిపై 9 లక్షల 12 వేల రూపాయలు వేతనము మరియు మెటీరియల్ రూపములలో ఖర్చు గావించుట జరిగినది. సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య కార్యక్రమము యందు కొత్త పనులను గుర్తించి చేపట్టుట జరుగుచున్నది. నూతన చెక్ డ్యాము లు మరియు మరమ్మత్తులు అవసరమయిన చెక్ డ్యామ్ ల యొక్క మరమ్మత్తులు కొరకు 24 పనులను గుర్తించి సుమారు 4 కోట్ల రూపాయలకు పరిపాలనామోదము ఈయబడినది.ఈ పనులు పూర్తిగావించబడినచో గ్రామములో గల బంజరు భూములలో ఎక్కువ శాతమును వ్యవసాయ యోగ్యముగా చేయవచ్చును.
ఈ సందర్భములో  తెలియజేయునది ఏమనగా గ్రామీణ ఉపాధి హామీ పధకము పంచాయతీ యూనిట్ గా నిర్వహింపబడుచున్నది.అన్ని పనులకు గ్రామపంచాయతీ యొక్క ఆమోదము తప్పనిసరియైయున్నది. ఈ పధకము యొక్క అమలులో గ్రామపంచాయతీ సర్పంచ్ చురుకుగా పాల్గొనవలసియున్నది.

12,  పర్యాటక సుందర స్వప్నం అరకు వ్యాలీకి 5కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దితే అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది.
వివరణ:
రేఖ సంఖ్య 132/RTIB/2016, 23.08.2016. ద్వారా అరకు మండలము పర్యాటక కేంద్రంగా అభివృధి చేయుటకు గాను సలహా ఇచ్చే నిపుణుడు ను నియమించమని  ప్రిన్సిపల్ సెక్రటరీ వారికీ  లేఖ వ్రాయడమైనది.

– (Babji, Asst Director, I&PR, VIZAG)

 

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *