Impact of Rural media

Impact of Rural media

కదిలిన కలెక్టర్లు
పనికిరాని బోర్లను పూడ్చండి అంటూ రూరల్‌మీడియా చేసిన ప్రయత్నం ఫలిస్తోంది.కరీంనగర్‌,వరంగల్‌,తాండూరు నుండి ఫోన్లు చేసి కేసింగ్‌లు లేని బోర్ల సమాచారం పంపిస్తామన్నారు.సర్పంచ్‌లు,వాటర్‌ షెడ్‌ సంఘాల ప్రతినిధులు బోర్ల సమాచారం సేకరిస్తున్నారు. మరి కొందరు చిన్నారులను కాపాడే ఈ కార్యక్రమానికి ఆర్ధికంగా సాయం చేస్తామంటున్నారు.మా వెబ్‌సైట్‌లో ఇచ్చిన జిల్లా కలెక్లర్ల కాంటాక్టు నెంబర్లకు కూడా చాలా మంది సమాచారం ఇస్తున్నారు. రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్‌ బోర్ల గుర్తింపు కార్యక్రమం ముమ్మరం చేసింది. తెలంగాణ సర్కారు కూడా తీవ్రంగా స్పందించింది.బోర్లను నిర్లక్ష్యం చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని,రైతులు మూయకపోతే అధికారులే మూసేయాలని జిల్లా కలెక్లర్లందరినీ ఆదేశించినట్టు సమాచారం.
ఇక్కడితో మా పని ముగిసినట్టు కాదు, మీకు తెలిసిన కేసింగ్‌లు లేని బోర్ల సమాచారం మాకు వాట్సాప్‌ (9440595858) చేయండి. వాటిని పూడ్చే ప్రయత్నం రూరల్‌మీడియా చేస్తుంది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *