దత్తత తీసుకోవడానికి పల్లెలేమైనా అనాధలా?

’I find whole thing of celebs adopting villages very insulting villages ‘’
-	Ramgopalvarma

దత్తత తీసుకోవడానికి పల్లెలేమైనా అనాధలా?

ఇటీవల సెలబ్రెటీస్‌ గ్రామాల దత్తత తీసుకోవడం పై సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కొత్త పాయింట్‌ లేవనెత్తుతున్నారు. ”ఒక పల్లెను దత్తత తీసుకోవడం అంటే అక్కడి ప్రజలందరినీ అవమానించినట్టే. ఆత్మగౌరవమున్న ఏ గ్రామస్తులు ఈ దత్తతను అంగీకరించరు. దత్తత తీసుకోవడానికి గ్రామాలేమైనా వికలాంగులా?అనాధలా? ఆత్మాభిమానం ఉన్న గ్రామస్తులు ఇలాంటి వాటిని వ్యతిరేకించాలి. గ్రామాలే దేశానికి వెన్నుముక అని గొప్పగా చెప్పుకుంటాం. అలాంటి గ్రామాలు ఒకరి దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నాయని అవమానించడం ఏంటీ?
పల్లెలు గౌరవ ప్రదంగా ఎదిగి అభివృద్ధి చెందాలి. దత్తత తీసుకోవడం అనే సంప్రదాయం వల్ల పాత రాజరిక వ్యవస్ధ వచ్చే ప్రమాదం ఉంది.దత్తత తీసుకున్న గ్రామాలకు తమను తాము మహారాజులుగా భావించే అవకాశం ఉంది.
ఎవరైనా అమీర్‌ పేట వెనుక ఉన్న బస్తీలను దత్తత తీసుకుంటారా? గ్రామల్లో కంటే నిరుపేదలెక్కువగా అక్కడ కనిపిస్తారు. గ్రామాల్లో కనీసం పచ్చదనమైనా కనిపిస్తుంది. ఇక్కడ అంతా కాలుష్యమే…వీటిని ఎందుకు ఎవరు దత్తత తీసుకోరు?
దత్తత తీసుకోవడం అనేది పబ్లిసిటీ కోసం తప్ప, మన సినీతారలకు పేదల కష్టాలను తీర్చాలనే హృదయం ఉంటుందని నేను అనుకోవడం లేదు” అని మెహమాటం లేకుండా కడిగేశారు వర్మ.

Related posts