చిత్రోత్సవానికి సినిమా పాస్‌ కావాలా?

Children’s film festival in Hyderabad from Nov 14, 2015


చిత్రోత్సవానికి సినిమా పాస్‌ కావాలా? 
 …………………………………………………. 
ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో సడీ చపుడు లేకుండా మొదలైంది. ఈ నెల 14 నుండి 20 తేదీ వరకు జరుగుతున్న ఈ బాలల పండుగ కార్యక్రమం ఏర్పాట్లు,జాగ్రత్తలు గురించి

Children’s film festival in Hyderabad from Nov 14, 2015

Children’s film festival in Hyderabad from Nov 14, 2015

సమాచారం చెప్పే నాధుడే లేడు. సినిమాలు చూడాలను కునే వారికి పాస్‌లు జారీ చేసే పద్దతి ఏమిటో ఎవరూ చెప్పడం లేదు. పాస్‌లు సమాచారం తెలియిని ఇద్దరు సీనియర్‌ టీవీ నటులు మైండ్‌ బ్లాంక్‌ అయి సమాచార శాఖ ఆఫీసులో తిరుగాడటం ‘రూరల్‌మీడియా ప్రతినిధి ‘ దృష్టికి వచ్చింది. ఎంపికైన సినిమాలు వాటి కథనాలతో తయారైన పుస్తకాలు ఇంకా రాలేదు. 
 అంతర్జాతీయ ప్రమాణాలున్న సినిమాలు చూడాలనుకునే అభిమానులు ఎక్కడ ఏ సినిమాను చూడాలో అంతుపట్టక నిరాశకు లోనవుతున్నారు.  
అయితే ఈ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో సినిమాలు చూడాలనుకునే వారి కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సౌకర్యం ఉంది. మీ వివరాలు, ఫొటో పంపితే వెంటనే మీ ఈ మెయిల్‌ కు ఒక రిఫరెన్స్‌ నెంబర్‌ వస్తుంది. మహవీర్‌ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఐ అండ్‌ పిఆర్‌ ఆఫీసులో ఉన్న చిల్డ్రన్‌ ఫిల్మ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా సెక్షన్‌కి కెళ్తే కుప్పలుగా పడి ఉన్న ఐడీ కార్డులు కనిపిస్తాయి. అక్కడున్న వారికి మీ నెంబర్‌ చూపించి వెతుక్కోవాలి. మీకు సినిమాలు చూసే యోగం ఉంటే మీ ఐడీ కార్డు దొరుకుతుంది. 
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి.

http://cfsindia.org/19icffi/delegates      

Related posts