ఒక ఆత్మహత్య ఆగింది…

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్నాపూర్‌లో సన్నగా చినుకులు మొదలయ్యాయి.
ఇద్దరు బిడ్డలు, నాలుగు మేకలతో ఒకే గదిలో బతుకుతున్న నర్సింహులు ఇంట్లోకి రూరల్‌ మీడియా అడుగుపెట్టింది.
” మా రెండెకరాల నేల షావుకారు స్వాధీనంలో ఉన్నది.దానిని తాకట్టు పెట్టిన మామ దిగులుతో మంచం పట్టి పైలోకాలకు పోయిండు. ఆ భూమిని సాగు చేసుకొందామంటే షావుకారు కాయితాలు ఇవ్వడు.

కూలికి పోదామంటే పనులు లేవు,ఇద్దరు బిడ్డలను పెంచుకునే దారిలేదు.. ఈ కష్టాలు తట్టుకోలేక నా భర్త ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు…” అని కళ్లలో నీరు తిరుగుతుంటే కొంగుతో తుడుచుకుంది చిట్కుల స్వరూపమ్మ.
తెలంగాణ పల్లెలో ప్రతీ గడపలో ఇలాంటి కన్నీళ్లు కామనే కానీ, ఆ చీకటి బతుకుల్లో ‘కిసాన్‌ మిత్ర’ అనే వెలుగు వచ్చింది.వారం రోజుల్లో తాకట్టులోని భూమి వారి స్వంతమైంది.

ఒక ఆత్మహత్య ఆగింది. ఒక జీవితం వెలిగింది.
రైతుల కన్నీళ్లు తుడిచే అమృత హస్తం’ కిసాన్‌ మిత్ర ‘
ఒక ఫోన్‌ కాల్‌ ( 1800- 120- 3244) మీ జీవితాన్ని మారుస్తుంది.

Share.

Leave A Reply