మనలో ఒకడు

“helping other is life”

మనలో ఒకడు
( కొండా కోనల్లో బడుగు జీవులకు భూములుంటాయి కానీ,అవెక్కడుంటాయో కూడా తెలీని అమాయకత్వం వారిది. అలాంటి వారి భూములు వెతికి వారికి చూపించి, భూమి హక్కుల గురించి వివరించి,వారి భాగస్వామ్యంతో భూసమస్యలు పరిష్కరించి,స్పష్టమైన హక్కులతో ఉన్న భూమి రికార్డులను వారి చేతిలో పెట్టడంలో కృషి చేస్తున్న ‘ల్యాండసా’డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌ ఇటీవల ఓ ఛాయ్‌ వాలాను కలిశారు. ఆ ముచ్చటను ఆయన మాటల్లోనే చదవండి…)

” నేను ఈరోజు ఒక ఛాయావాలాను కలిసాను …. ప్రధానమంత్రిగారిని కాదు …. మరైతే విశేషమేంటి అంటారా..ఈయన కూడా మామూలు ఛాయావాలా కాదు…దేశానికీ ప్రధాన మంత్రి కాలేదు కానీ…తన ఛాయాకొట్టు ద్వారా వచ్చే రోజువారీ సంపాదనలో సగం డబ్బుతో ఒక చిన్నపిల్లల బడి , ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సహాయం చేస్తున్నాడు.

tea-seller-prakashrao

tea-seller-prakashrao

కటక్ లో కొన్ని వందలమందికి అప్ప్తుడయ్యాడు …ఇప్పటికి 40 ఏళ్లకుపైగా వాడుతున్న సైకిల్, తండ్రి ఇచ్చిన ఇల్లు తప్ప వేరే ఆస్థి లేదు …ఇప్పటికి 200 సార్లకు పైగా రక్తదానం … ఏడు భాషలు మాట్లాడతాడు … రోజు 7 గంటలు సమాజ సేవ …ఉదయం సాయంత్రం చాయ దుకాణంలో పని… రోజు దాదాపుగ 30 – 40 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం ….70 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల యువకుడిలా ఉత్సాహంతో పనిచేస్తూ…నాకు చాయ ఇస్తూ నవ్వుతూ అన్నాడు … “డబ్బుదేముంది సార్ పది మందికి సాయపడటమే జీవితం”…ఒడిష నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఈయన ( D.Prakashrao )గురించి చెప్తే ఈరోజు అతన్ని కలిసాను ..”
– Sunil Kumar M (Director of Land Laws and Policies, India at Landesa)

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *