జై కిసాన్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

జై కిసాన్‌
రైతుల కోసం ప్రభుత్వం చేసిన వాగ్దానాలకూ, వాటన్నిటినీ తీర్చామని చెబుతున్న లెక్కలకూ పొంతన లేకపోవడాన్ని గమనించి, ఆగ్రహించి మహారాష్ట్ర రైతులు మారుమూల గ్రామాలనుంచి ఆరు రోజులపాటు ‘లాంగ్‌మార్చ్‌’ నిర్వహించి ముంబై మహా నగరానికి వెల్లువలా తరలివచ్చారు.
ఈ రైతులంతా ఆదివాసీలు. ఈ ‘లాంగ్‌ మార్చ్‌’లో యువ రైతులు మొదలుకొని వ ద్ధుల వరకూ ఉన్నారు. కొందరు తల్లులు తమ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. కాళ్లకు చెప్పుల్లేనివారూ, కట్టుకోవడానికి సరైన బట్టల్లేనివారూ ఈ 50,000మందిలో ఉన్నారు. వీరంతా ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా అమలు చేస్తున్నామంటున్న రుణాలను పొందలేక వడ్డీ వ్యాపారుల నుంచి అధిక మొత్తాల్లో అప్పులు చేసి సేద్యం సాగించినవారు. విత్తనాలు మొదలుకొని ఎరు వులు, పురుగుమందుల వరకూ అన్నిటి ధరలూ పెరిగిన కారణంగా ఖర్చు తడిసిమోపెడై ఊపిరాడని స్థితికి చేరుకున్నవారు. ఈ కష్టాలన్నిటికీ ప్రక తి వైపరీత్యాలు తోడై చివరకు దిగుబడి సమయానికి పంటలకు గిట్టుబాటు ధర రాక చితికిపోతున్నవారు. ప్రభుత్వాలు అమలు చేసే రకరకాల ప్రాజెక్టుల కార ణంగా కొంపా గోడూ పోగొట్టుకుంటూ నిరాశ్రయులవుతున్నవారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడుతున్నవారు. అందువల్లే ఈ రైతులు కేవలం రుణమాఫీని మాత్రమే డిమాండ్‌ చేయలేదు. అటవీ హక్కుల పరిరక్షణ చట్టం కింద తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, స్వామి నాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణ యించాలని, వ ద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. అకాల వర్షాల వల్ల, చీడపీడల వల్ల నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లాగే మహారాష్ట్ర రైతులు కూడా వరస కరువుల్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని కోటి 37 లక్షలమంది రైతుల్లో 78 శాతంమంది చిన్న, సన్నకారు రైతులు. ప్రభుత్వం అమలు చేశామంటున్న రుణమాఫీతో సహా ఏదీ సక్రమంగా ఈ రైతులకు దక్కలేదు. అందుకే రైతుల్లో ఇంతగా అసంతప్తి.
తల వంచిన ప్రభుత్వం
భగభగ మండే ఎండలో ”మహా పాదయాత్ర” చేసుకుంటూ ముంబయిచేరిన వేలాదిమంది మహారాష్ట్ర అన్నదాతలు సోమవారం శాంతించారు. ప్రతిపక్షాలతోపాటు శివసేన ఒత్తిడి నడుమ వీరి డిమాండ్లకు రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వం అంగీకరించింది. దీంతో నిరసనలను విరమిస్తున్నట్లు రైతులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిష్టకూ పోకుండా, రైతులను రెచ్చగొట్టకుండా వారడిగిన డిమాండ్లలో పదింటిని నెరవేర్చడానికి లిఖితపూర్వకంగా ఒప్పుకుని సానుకూల దక్పథాన్ని ప్రదర్శించింది.
సీపీఎం అనుబంధ అఖిల భారత కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) ఆధ్వర్యంలో నాసిక్‌ నుంచి ముంబయికి(180 కి.మీ.) తరలివచ్చారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్‌ మైదాన్‌లో వీరిని ఉద్దేశించి రాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌ ప్రసంగించారు. దాదాపు అన్ని డిమాండ్లూ తమకు సమ్మతమేనని తెలిపారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఎదుట ఆయన ప్రకటన చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విలేకరులతో మాట్లాడారు. అటవీ భూముల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజనులు, రైతులకు పట్టాలు ఇవ్వడంపై ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
నిశ్శబ్ద విప్లవం
ఈ రైతు యాత్ర సాగిన వారం రోజులూ ఒక్కటంటే ఒక్క అపశ్రుతి చోటు చేసుకోకపోవడం, అందులో పాల్గొన్నవారంతా ఎంతో క్రమశిక్షణతో మెలగడం అందరినీ ఆకట్టుకుంది. అంత కన్నా ముఖ్యమైనదేమంటే ఈ యాత్రకు పట్టణ, నగర ప్రాంతాల పౌరుల నుంచి వచ్చిన స్పందన. యాత్ర ప్రారంభమైన నాసిక్‌లోగానీ, ఆ తర్వాత ఠాణేలోగానీ, ముంబైలోగానీ ఆ రైతులకు పౌరులు ఘన స్వాగతం పలికిన తీరు అమోఘం.
చెప్పులు లేకుండా నిరంతరాయంగా నడవటం వల్ల అరికాళ్లకు పుళ్లు పడి ఇబ్బందిపడుతున్నవారిని గమనించి కొందరు తమ పాదరక్షల్ని ఇచ్చారు.. వివిధ సామాజిక సంస్థల నిర్వాహకులు ఆ రైతుల ఆకలిదప్పుల్ని తీర్చారు. కొన్ని ఆసుపత్రులు, కొందరు వైద్యులు స్వచ్ఛందంగా రైతులకు వైద్య సేవలందించారు.
కమ్యూనిస్టులంటే ససేమిరా గిట్టని శివసేన ఈ యాత్రకు మద్దతు ప్రకటించడం ఒక విశేషమైతే…తమ పార్టీ ఎంపీ తెలిసీ తెలియక మాట్లాడిన మాటలను బీజేపీ తిరస్కరించడం మరో విశేషం. ఈ ఆందోళన మహారాష్ట్ర పాలకులకు మాత్రమే కాదు… అన్ని రాష్ట్రాల పాలకులకూ హెచ్చరికే. వాగ్దానాలిచ్చి మాట తప్పితే రైతులు మునుపటిలా మౌనంగా ఉండరని, తిరగ బడతారని ఒక పాఠం చెప్పారు.
రైతంటే సంఘటిత శక్తి..
రైతంటే నేలతల్లి అంత సహనం
రైతంటే ఆత్మత్యాగానికీ వెనుకాడని మొండితనం అని మహారాష్ట్ర కర్షకులు నిరూపించారు.
ఇవీ ప్రధాన డిమాండ్లు
1. రైతుల్లో చాలామంది మహారాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద లబ్ధిపొందలేకపోతున్నారు. దీంతో బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
2. అటవీ భూముల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులు తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 3. రైతులు స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) పంట ఉత్పత్తి వ్యయం కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండాలని కోరుతున్నారు .
4. వడగళ్ల వాన, కీటకాల దాడుల్లో నష్టపోయిన పంటలకుగాను ఎకరానికి రూ.40,000 పరిహారాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.
5. బుల్లెట్‌ రైళ్లు, ప్రధాన రహదారుల నిర్మాణం లాంటి భారీ ప్రాజెక్టుల కోసం బలప్రయోగంతో వ్యవసాయ భూములను లాక్కోవడంతోపాటు నదుల అనుసంధానం ప్రాజెక్టులనూ రైతులు వ్యతిరేకిస్తున్నారు.

Share.

Leave A Reply