పెప్సీ,కోక్‌లకు ధీటుగా గిరిజన్‌ కూల్‌ డ్రింక్‌?

GCC products at WalMart malls soon…

పెప్సీ,కోక్‌లకు ధీటుగా గిరిజన్‌ కూల్‌ డ్రింక్‌?
జనం ఆరోగ్యంతో ఆడుకుంటున్న బహుళజాతి కూల్‌డ్రింక్స్‌కు పోటీగా ఔషధ గుణాలున్న రెండు అద్భుత పానీయాలు మార్కెట్‌ లోకి వచ్చాయి. అరకు,పాడేరు గిరిజన ప్రాంతాల్లో సేకరించిన సుగంధి,మారేడు బెరడులతో నన్నారి,బిల్వ పానీయాలను జిసిసి సంస్ద తయారు చేస్తోంది. చిత్తూరు జిల్లా srini foods లో ఈ పానీయాలను టెట్రా ప్యాక్‌లు చేసి మార్కెట్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల జీసీసీ ఎండీ రవిప్రకాశ్‌ రూరల్‌మీడియా తో ముచ్చటిస్తూ” నన్నారీ,బిల్వ షర్బత్‌లను విశాఖలోని పలు చోట్ల వెండింగ్‌ మిషన్ల ద్వారా అమ్మకాలు చేపట్టాం.వీటికి భారీ స్పందన రావడంతో టెట్రా ప్యాక్‌లను రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం.అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన అరకు కాఫీ వెండింగ్‌ మిషన్‌ని సీఎం ఆఫీసులో ఏర్పాటు చేశాం.

GCC Nannari

GCC Nannari

ఈ వేసవిలో ఇప్పటి వరకు 85వేలకు పైగా బిల్వ,నన్నారీ షర్బత్‌ బాటిల్స్‌ని జీసీసీ విక్రయించింది.వీటితో పాటు త్రిఫల జ్యూస్‌,పౌడర్‌లను కూడా జీసీసీ మార్కెట్‌లోకి తెచ్చింది. మా ఉత్పత్తులన్నీ త్వరలో వాల్‌ మార్ట్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి. ముందుగా కాఫీ,తేనె,నన్నారీ,బిల్వ షర్బత్‌లను వాల్‌మార్ట్‌ స్టోర్‌లలో ప్రవేశ పెడతాం.”
సహజసిద్దమైన జిసిసి ఉత్పత్తుల కోసం ఇక్కడ సంప్రదించండి…
( Phone: +91 – 891 – 2581661 2796164 Fax: +91 – 891 2796345, Email: raviprakash2525@gmail.com)

 

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *