రోజూ ముక్కు మూసుకొని చదువుకోవాలి

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రకృతి అందరికీ స్వచ్ఛమైన గాలిని ఇచ్చింది. మరి ఈ బిడ్డలెందుకు? ఇలా ముక్కు మూసుకొని బడికి వెళ్లాలి? ఒక్క రోజు కాదు,రెండు రోజులు కాదు,ఏకంగా మూడేళ్లుగా ఇదే పరిస్ధితి. ఎందుకంటే చెత్తను నిలువ చేయడానికి, ‘మహేశ్వరి’ విద్యాలయం(ఓల్డ్‌ ఖబుదర్‌ ఖానా) పక్కనే సూటబుల్‌ గా ఉందని జీహెచ్‌ఎంసీ డిసైడ్‌ అయింది. ‘మాకు కనీసం మాస్క్‌లైనా ఇప్పించండి’ అని ఈ స్టూడెంట్స్‌ అంటున్నారు. క్లాసులో కిటికీలు మూసినప్పటికీ వస్తున్న దుర్గంథం భరించ లేక ముక్క మూసుకోవాల్సి వస్తుంది.

ఒక్క రోజు కాదు,రెండు రోజులు కాదు… ఏకంగా 3 సంవత్సరాల నుండి ఇక్కడి విద్యార్థులు ముక్కుమూసుకొని స్కూల్‌కి వస్తున్నారు. క్లాసులో కిటికీలు మూసినప్పటికీ వస్తున్న దుర్గంథం భరించ లేక ముక్క మూసుకోవాల్సి వస్తుంది. లంచ్‌ కూడా అతి కష్టంగా కానిస్తున్నారు.
దీనికి కారణం వీరి స్కూల్‌ పక్కనే జిహెచ్‌ఎంసీ చెత్త డంపింగ్‌ యార్డ్‌ని నిర్వహించడమే…ఓల్డ్‌సిటీలో సేకరించిన చెత్తనంతా ఇక్కడ పోగు చేయడమే.
ఎక్కడా..?
హైదరాబాద్‌,ఛార్మినార్‌ సమీపంలో ఓల్డ్‌ ఖబుదర్‌ ఖానాలో ఉంది మహేశ్వరి విద్యాలయం. ఇక్కడ తెలంగాణ నుండే కాక, గుజరాత్‌,బెంగాల్‌,మహారాష్ట్ర నుండి వచ్చి హైదరాబాద్‌లో స్దిర పడిన కుటుంబాల పిల్లలు చదువుతున్నారు.విభిన్న సంస్కృతుల నుండి వచ్చిన చిన్నారులతో దాదాపు చిన్న మినీభారతంలా ఉంటుంది ఈ స్కూల్‌.
పిల్లలకు అనారోగ్యం

A Garbage bin at entrance of the maheswari school

A Garbage bin at entrance of the maheswari school 1

” మహేశ్వరి సేవాట్రస్టు ఆధ్వర్యంలో ఈ స్కూల్‌ నిర్వహిస్తున్నాం. ఎనిమిది వందల మంది విద్యార్దులు ఇక్కడ చదువుతున్నారు. స్కూల్‌ లోకి రావాలంటే ముక్కు మూసుకొని రావాల్సిందే.. దీని వల్ల పిల్లలు రోగాల పాలవుతున్నారు. రోజుకి ఒకరిద్దరు వాంతులు చేసుకొని ఇంటికి వెళ్లి పోతున్నారు… జీహెచ్‌ ఎంసీ వారికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు…’ అని ‘మనతెలంగాణ’ తో అంటారు స్కూల్‌ అడ్మిన్‌ మౌనిక.
అధికారులకు తెలిసినా…
ఈ సమస్యను విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినపుడు వారిలా స్పందించారు. ” ఇటీవల ఈ స్కూల్‌కి వెళ్లి పరిశీలించాం. మేం కూడా ముక్కు మూసుకొని వెళ్లాల్సి వచ్చింది.
స్కూల్‌ పక్కనే భారీ చెత్తకుప్పలున్నాయి. నివాసాలు,విద్యాలయాలున్న చోట ఇలాంటి చెత్త
డంపింగ్‌ కేంద్రాలు పెట్ట కూడదు. జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడి దీనిని తొలగించడానికి ప్రయత్నిస్తాం..” అని డిప్యూటీ డిఇఓ నెహ్రూబాబు చెప్పారు.
” ఈ దుర్గంధం వల్ల పిల్లలు సరిగా పాఠాలు వినలేక పోతున్నారు. లంచ్‌ కూడా సరిగా చేయలేక పోతున్నారు. స్వచ్ఛాభారత్‌ అని ప్రచారం చేస్తున్నారు తప్ప మా స్కూల్‌ పక్కనున్న డంపింగ్‌ యార్డును తొలగించ డానికి ఏ అధికారి ముందుకు రావడం లేదు. తరచూ పిల్లలు అనారోగ్యం పాలువుతున్నారు…”అంటున్నారు. మహేశ్వరి స్కూల్‌ టీచర్లు అనితాయాదవ్‌, సునీత.
800విద్యార్ధులున్న ఈ స్కూల్‌ని సేవాభావంతో నడుపుతూ అతి తక్కువ ఫీజులు(ఏడాదికి రూ.3,200నుండి రూ.5000) తీసుకుంటారు.దీంతో మధ్యతరగతి వర్గాల పిల్లలు ఎక్కువగా ఇక్కడ చదువుతున్నారు. ఇలాంటి గత మూడేళ్లుగా భరించలేని దుర్గంధం వల్ల పిల్లలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదొర్కొంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పేరెంట్స్‌ కోరుతున్నారు.

(This article is presented under RuralMedia-Nirmaan partnership. contact- 9440595858)

Share.

Leave A Reply