పరిమళాన్ని పంచుతున్నట్టు పువ్వులు చెబుతాయా ?

Google+ Pinterest LinkedIn Tumblr +
” పులివెందులలో పాఠశాలను స్థాపించి రెండువేలమంది విద్యార్థులకు ఉచితవిద్యను కల్పిస్తున్నట్లు, అదే విధంగా వికలాంగులకు కూడా మరో పాఠశాలను నిర్వహిస్తున్నట్లు, అలాగే ఉచిత ఆసుపత్రిని కూడా నడుపుతున్నట్లు ఈరోజు జగన్ చెప్పడం విని ఆశ్చర్యపోయాను.
ఇంతవరకూ పైవిషయాలు చాలామందికి తెలియవు. జగన్ ఎన్నడూ చెప్పుకోలేదు. నేను ఎన్నడూ వినలేదు. ఎంతోమంది తెలిసినవారున్నా ఒక్కరు కూడా చెప్పలేదు. బహుశా వారికి కూడా తెలియదేమో?

G.Venkatappa Memorial School, pulivendula3

G.Venkatappa Memorial School, pulivendula3

ఔరా…చూస్తుంటే చిత్తశుద్ధితో సేవలు చేసే వదాన్యులు ఎప్పుడూ తమ గొప్పలు చెప్పుకోరేమో? తాము సుగంధాన్ని విరజిమ్ముతున్నట్లు పువ్వులు ఎన్నడూ ప్రకటించవు. 
కుడిచేత్తో చేసేదానం ఎడమచేతికి తెలియనివ్వరాదు అంటారు పెద్దలు.
సంపద ఉంటె సరిపోదు. సద్వినియోగం చెయ్యడం కూడా చేతకావాలి. రూపాయి దానం చేసి వందరూపాయల గొప్పలు చెప్పుకునే మనుషులున్న ఈ రోజుల్లో ఇలా ఉంటె ఎలా మిస్టర్ జగన్?
జగన్మోహన్ రెడ్డికి మనఃపూర్వక అభినందనలు.”
Share.

Leave A Reply