కొత్త సంవత్సరంలో ‘సరికొత్త దినపత్రిక’

first Telugu news paper from Navya andhra

కొత్త సంవత్సరంలో ‘సరికొత్త దినపత్రిక’ 
…………………………………………………… 
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక ప్రముఖ దిన పత్రికలు రెండు చోట్ల ప్రత్యేక ఎడిషన్లు ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం వైజాగ్‌ కేంద్రంగా ఒక దిన పత్రిక మొదలైంది. తెలంగాణ నుండి మరో రెండు దిన పత్రికలు రాబోతున్నాయి. ఒక ఫైనాన్స్‌ కంపెనీ ఛానెల్‌ కోసం ప్రజల దగ్గర రూ.50 కోట్లకు పైగా షేర్ల రూపంలో వసూలు చేసింది.కానీ ఇంకా టీవీ కార్యక్రమాలు మొదలు కాలేదు. ప్రస్తుతం వసూలు చేసిన డబ్బుకు వడ్డీలు చెల్లించే పనిలో ఉన్నారు. 
ఈ దృశ్యం ఇలా ఉండగా… 
ఇపుడు మరో తెలుగు డైలీ జనవరి 2016 నుండి రాబోతుంది. 
హైదరాబాద్‌,విశాఖపట్నం, కాకినాడ నుండి ఒకే సారి ఈ పత్రిక ప్రచురించ బోతున్నారు. 
 గతంలో సమాచార శాఖతో సహా వివిధ ప్రభుత్వ డిపార్టుమెంట్లలో మీడియా ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వహించిన వి.ఎస్‌.డి . ప్రసాద్‌ ఈ దినపత్రికకు ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌. 
” గతంలో ఆంగ్లంలో మ్యాగజైన్‌గా వెలువడి ‘మిర్రర్‌ టుడే’ పత్రికను దిన పత్రికగా మార్చి తెలుగులో ప్రచురించ బోతున్నాం. సమాకాలీన వార్తలకు నిలువుటద్దంగా ‘మిర్రర్‌ టుడే’ తీర్చిదిద్దుతున్నాం” అని ప్రసాద్‌ ‘రూరల్‌మీడియా’ కు తెలియ చేశారు.  
రీడర్స్‌ని ఆకట్టుకునేలా డిజైన్‌, వార్తలు, కథనాలు,రిపోర్టింగ్‌లో సలహాలు కావాలని సీనియర్‌ పాత్రికేయులను ‘మిర్రర్‌ టుడే’ యాజమాన్యం కోరుతోంది. 
.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *