అరకులో ఆధునిక టాయిలెట్స్‌!

mplad scheme guidelines in telugu

అరకులో ఆధునిక టాయిలెట్స్‌!
…………………………………………..
ఉపాధి హామీ పథకంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం మహిళలకు వరం. వారి ఆత్మగౌరవాన్ని కాపాడే మానవీయ కార్యక్రమం ఇది. వీటి నిర్మాణంలో ఒక వైవిధ్య శైలిని అరకులోయలో అమలు చేశారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామం పెదలబుడు చూసి వస్తుంటే… పక్కనే ఉన్న మాలిశింగవర గ్రామంలో వినూత్నమైన ఫైబర్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేయడం మా దృష్టికి వచ్చింది.

Fibretoilets-in-araku-ruralmedia3

Fibretoilets-in-araku-ruralmedia3

సాధారణ మరుగుదొడ్లను ఇటుక, సిమెంట్‌ రాయితో నిర్మిస్తారు. నిర్మాణానికి తాపీమేస్త్రీ, మెటీరియల్‌ సరఫరా సమస్యలు అనేకం. ఇలాంటి ఇబ్బందుల నుండి గిరిజనులను కాపాడటానికి 80 రెడీమేడ్‌ ఫైబర్‌ టాయిలెట్లను ఈ గ్రామంలో ప్రయోగాత్మకంగా వారం రోజుల్లోనే ఏర్పాటుచేశారు. వీటి నిర్మాణంలో స్ధానికులకు ఉపాధి పనిదినాలు దొరికాయి. ”ఫైబర్‌ మరుగుదొడ్లు ఎంతో సౌకర్యంగా ఉండటమే కాక నాణ్యతతో ఉన్నాయి. గతంలో టాయిలెట్స్‌ లేక గుట్టల పైకి పోవాల్సి వచ్చేది. ఇపుడీ కష్టాలు తప్పాయి” అని ‘రూరల్‌మీడియా’ తో గ్రామస్థులు గంపరాయి పూజిత, మొస్య వంజన, సోయి దాలిమ అన్నారు.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *