అవకాశం నీ హద్దురా?

Google+ Pinterest LinkedIn Tumblr +

అవకాశం నీ హద్దురా?
…………………………
గత రెండేళ్లలో రూరల్‌మీడియా తరుపున నాలుగు డాక్యుమెంటరీలు తీశాం గానీ వాటిలో ఏ ఒక్కటీ నచ్చలేదు నాకు. ప్రభుత్వ శాఖలు చెప్పినట్టు తీయడం వల్ల విజువైల్స్‌ అలా వచ్చాయని సరిపెట్టుకుంటే మాకు వచ్చే సమస్యేమీ లేదు.కానీ మేం కూడా సాటిఫై కావాలి కదా. ఫిల్మ్‌ మేకింగ్‌ మీద అవగాహన లేక పోవడం ఖచ్చితంగా మా లోపం.
ఇటీవల ఓ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి
ఒక ఫిల్మ్‌ లింక్‌ పంపి, చూడమన్నారు. వెంటనే ప్లే చేశాను.

మనకు తెలియని తెలంగాణను ద్రోన్‌ కెమారాల్లో ఆవిష్కరించిన తీరు అద్భుతం.
ఎగ్జియింటింగ్‌ని తట్టుకోలేక ఈ ఫిల్మ్‌ మేకర్‌ ఎక్కడుంటారు సార్‌ ?అని అడిగాను.
”ప్రస్తుతం పోర్చుగల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉన్నాడు. ఆ ఫిల్మ్‌కి ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది.” అని కూల్‌గా చెప్పి వాట్సాప్‌లో అతని వివరాలు పంపారు.
ఆ ఫిల్మ్‌తీసిన యువకుడు పేరు సత్యనారాయణ. జీవితమంతా పేదరికం అనుభవించాడు. ఆయన తల్లి మంచిర్యాలలో టీ షాప్‌ పెట్టుకుని బతుకుతున్నారు. కప్పులు కడుగుతూ తల్లికి చేదోడుగా ఉండే వాడు. అతను పేదరికంలో పుట్టినా ఫిల్మ్‌మేకింగ్‌లో వెరీ రిచ్‌.  Every single frame … so rich and beautiful.
వచ్చిన అవకాశాన్ని
ఉపయోగించుకోవడం తెలీని నాలాంటి వారి కోసం ఇదంతా…

Share.

Leave A Reply