ఇనుములో హృదయం మొలిచెను

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇనుములో హృదయం మొలిచెను…
ఇక్కడ సర్కారీ ఉద్యోగులకు నిరంతరం ఏదో ఒక ట్రైనింగ్‌ ప్రోగ్రాం జరుగుతుంటుంది.జాతీయ, అంతర్జాతీయ సెమినార్లకు ఇదొక అందమైన వేదిక. ఆకుపచ్చని వనాలు ,పక్షుల కిలకిలల మధ్య  Dr. MCR HRD Institute of Telangana ఒక విశాలమైన కళాత్మక భవన సముదాయం.

ఇటీవల ఈ హరిత నిర్మాణం చుట్టూ ‘ప్రకృతి కళ’ సంతరించుకుంది.పనికిరాని పాత ఇనుప ముక్కలు,బోల్టులు,నట్టులను శిల్పాలుగా మలిచిన తీరు ఇక్కడ అడుగు పెట్టిన వారికి ఆహ్లాదకరమైన అనుభూతికి లోనయ్యేలా చేస్తుంది.పురివిప్పిన మయూరం,ఎగురుతున్న జింకలు స్క్రాప్‌తో జీవం పోసుకున్నాయి. జూబ్లీహిల్స్‌ పదోనంబర్‌ రోడ్‌లో మెగాస్టారు ఇంటికి సమీపంలో ఉన్న MCR HRD లో ఒక్క సారి అడుగు పెట్టి తీరాలి. ఈ సమ్మర్‌లో  గొప్ప రిలీఫ్‌.

Share.

Leave A Reply