కూలీలుగా రాజీ పడిన పీజీ అమ్మాయిలు…

Educated students become mgnrega workers?

కూలీలుగా రాజీ పడిన పీజీ అమ్మాయిలు…
……………
నల్గొండ జిల్లా, నకిరేకల్‌ పాత బస్టాండ్‌ వెనుక ఉన్న ప్రభుత్వ బంజరు భూమిలో సర్కారీ తుమ్మ చెట్లను వేళ్లతో సహా తొలగించి భూమిని సాగుకు అనువుగా మార్చారు, ఉన్నత చదువులు చదివిన పేద నిరుద్యోగులు .
ఇస్సాయిగుంటలోని 3 ఎకరాల బంజరు భూమిలో పిచ్చి చెట్లు, రాళ్లు, తుమ్మ చెట్ల తొలగించి తెలంగాణ హరితహారంలో మొక్కలు నాటుతున్నారు. ఈ భూమి అభివృద్ధిలో కృషిచేస్తున్న వీరంతా వికలాంగులే… వీరిలో ఉన్నత విద్య చదివిన నలుగురు యువతులు కూడా ఉండటం విశేషం. నిరుద్యోగంతో బాధలు పడుతున్న తమకు ఉపాధిహామీ పథకం ఆసరాగా నిలిచిందని వారంటున్నారు.
”మేమంతా బి.ఎస్‌సి, బి.ఈడి, యం.ఎస్‌సి, యం.ఏ తెలుగు చదివిన వాళ్లం, మా చదువుకు తగిన ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో కన్న వారికి భారంగా మారాం. ఇలాంటి సమయంలో ఉపాధిహామీ పథకం ద్వారా బంజరు భూమిని అభివృద్ధి చేసే పనులు దొరికాయి. పలుగు, పారతో మా శక్తి మేర తుమ్మ చెట్లను తొలగిస్తున్నాం. భూమిని చదును చేశాక పండ్ల మొక్కలు, నల్ల తుమ్మ నాటుతాం. వ్యవసాయ పనిముట్లు, ఇంటి అవసరాలకు పనికొచ్చే వస్తువుల తయారీకి నల్ల తుమ్మ కలప ఎంతో అనుకూలం. ఉన్నత చదువులు చదివిన మేం రోజూ కూలీగా పని చేయడాన్ని అవమానంగా భావించడం లేదు. ఏ పనీ లేని మాకు ఇలా ‘ఉపాధి’ కలిగింది.” అంటున్నారు,కప్పల శోభారాణి, కొండా జానమ్మ, జ్యోతి  Read more stories at:

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *