దేవ ‘ సేన’

Dare and Dashing Collector in Jangaon district

దేవ ‘ సేన’
వారు శరీరాన్నే ఆయుధంగా మార్చుకున్నారు…
కరాటే వీరులు,మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణులుగా మారారు
సన్నగా ఉన్నా,సంఘటిత బలంతో కొండల్ని పిండి చేస్తున్నారు..
వీరి పంచ్‌లకు పోకిరీలు కింద పడాల్సిందే..
దుండగులకు దడ పుట్టిస్తున్న జనగామ మహిళా దళం వెనుక ఉన్న పాలనాధికారి దేవసేన.
చెరువులను మింగుతున్న కబ్జాదారులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న ఈ డేరింగ్‌ కలెక్టరమ్మ మహిళల గుండెల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ ఆడబిడ్డల జేజేలు అందుకుంటున్నారు.

‘సంఘటిత సబల’

Girls performing at the mass demonstration of martial arts and self defensce techniques in Jangaon

Girls performing at the mass demonstration of martial arts and self defensce techniques in Jangaon

జనగామ ఇండోర్ స్టేడియంలో  జాతీయ బాలికల దినోత్సవం రోజున జరిగిన ‘సంఘటిత సబల’ కార్యక్రమంలో 13683 మంది విద్యార్థినులతోపాటు 3 వేల మంది ఇతర బాలికలు, ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు…. వెరసి మొత్తం 20 వేల మంది మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన ఇచ్చారు. మహిళలు, బాలికలు తమ మీద జరిగే దాడులను ఎలా ప్రతిఘటించాలో సోదాహరణంగా వివరించిన ఈ ప్రదర్శన జనగామ గర్వించేలా జరిగిందన్న ప్రశంసలు వినిపించాయి. ప్రశంసలు మాత్రమే కాదు.. అతి పెద్ద మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన, శిక్షణా కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని నమోదు చేస్తున్నట్టు గిన్నిస్ రికార్డు భారతీయ ప్రతినిధి జయసింహ ప్రకటించారు.

జనగామ జిల్లా కలెక్టర్ దేవసేన గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. ‘సంఘటిత సబల’ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించేలా చేసిన బాలికలకు, మహిళలకు ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలిపారు.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *