అపర భగీరథి

Community in action to solve ground water crisis

గోమ్లే
మగవాళ్లు ఫెయిల్‌ అయినపుడు ఆడవాళ్లు బాధ్యత తీసుకోక తప్పదు. ……
ఒకపుడు కాదు ఇప్పటికీ అది కరవు ప్రాంతమే. నీళ్లు లేక ఉపాధి కరవైంది.వలసలు పెరిగాయి.పిల్లలు చదువుకు దూరమయ్యారు.ఆడవాళ్లు లేచింది మొదలు నీటి జాడ వెతుక్కుంటూ వెళ్లేవారు.ఇలా ఎంతకాలం? కొన్నాళ్లకు సమస్యకు పరిష్కారం వెతికారు.
నీళ్లే తమ బాధలకు మూలం అని గ్రహించి,వానలు మాత్రమే తమ ఊరికి ఆధారం,అవి పడ్డపుడే ప్రతీ బొట్టును దాచుకోవాలని డిసైడయ్యారు.తోడేళ్ల గడ్డ(పాలమూరు జిల్లా) కు చెందిన గోమ్లే తన తోటి మహిళలను కూడ గట్టి, స్వచ్చంద సంస్ధల సాయంతో వాననీటిని నిలువ చేసే పద్దతులు తెలుసుకున్నారు. ఇంకుడు గుంతలు తవ్వారు. పొలం గట్లమీద మొక్కలు నాటారు.బావులను బోర్లను చెరువులను రీఛార్జి చేసి మళ్లీ ఎండి పోకుండా కాపాడారు. కష్టం ఫలించి వేసంగిలో కూడా బోర్లలో జల కళ తగ్గలేదు.
వాన నీటి కోసం తవ్విన ఫారం పాండ్‌ ఎండి పోవడంతో బోర్ల లో నీటిని పైపుల ద్వారా పంటకుంటలోకి మళ్లించి మిర్చి,కంది పండిస్తుంది గోమ్లే . స్వయంగా ట్రాక్టర్‌ తోలుతూ దిగుబడిని మార్కెట్‌కి తరలిస్తుంది.భర్త కూలీ పనులకు పోతే గోమ్లే వ్యవసాయ పనులు చేసుకుంటుంది. పేద మహిళల స్వశక్తితో సుభిక్షంగా మారిన ఆ పల్లె విజయం, మాకు మండే ఎండలను మరిచి పోయేలా చేసింది.

pics- K.Rameshbabu /ruralmedia

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *