రాములమ్మకు ఒక లైక్‌ ఇస్తారా?

Google+ Pinterest LinkedIn Tumblr +

రాములమ్మకు ఒక లైక్‌ ఇస్తారా?
అనేకనేక సమస్యలతో వచ్చిన జనంతో కలెక్టరేట్‌ కిటకిటలాడుతోంది.
వారి మధ్య నుండి పాలనాధికారి ముందుకు దూసుకు వచ్చింది రంగం రాములమ్మ.
” మా పొలంలో కరెంట్‌ తీగెలు కిందికి వేలాడుతున్నయి, విత్తునాటాలన్నా, కోత కోయాలన్నా గవి వీపుకు తగుల్తున్నయ్‌, కరెంటోళ్లకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు, పేపరోళ్లు కూడా మా వైపు చూస్త లేరు. కరెంట్‌ తీగల నడుమ ఎవుసం ఎట్లా చేయాలమ్మా? జర చూడమ్మా కలెక్టరమ్మా” అని చేతిలోని వేలాడుతున్న కరెంట్‌ తీగెల ఫొటో కూడా చూపించింది.

yellayya-ramulamma@ farm in chaitanyanagar

yellayya-ramulamma@ farm in chaitanyanagar

రాములమ్మ ఆందోళన కలెక్టర్‌ని కదిలించింది. సమస్యను ఫొటో తీసి చూపించిన ఆ పేదరాలి చొరవ ఇంకా నచ్చింది. వెంటనే విద్యుత్‌ అధికారులును పిలిచి రాములమ్మ పొలానికి పంపించి సమస్యను ఆరోజే పరిష్కరించారు. గత పదిహేనేళ్లుగా ఆ రైతు పడుతున్న ఇబ్బందులు తీరాయి. పొలంలో వరి,కందులు పండిస్తూ హ్యాపీగా బతుకుతున్నారు.
ఇంతటి చైతన్యం ఉన్న రాములమ్మ ఊరి పేరు చైతన్య నగర్‌(వికారాబాద్‌, తాండూరు మధ్యలో)
ఆ సమస్యను పరిష్కరించిన కలెక్టరమ్మ దివ్యాదేవరాజన్‌.

(నిన్న చైతన్య నగర్‌ ఫీల్డ్‌విజిట్‌లో కలిసిన రాములమ్మ,ఎల్లయ్యలు చెప్పిన 3నెలల క్రితం ముచ్చట ఇది.)

Share.

Leave A Reply