Changing Tribal Life

Changing Tribal Life

పాటగూడ బావి సూపర్

ఇంద్రవెల్లిలో ఆత్రం అమృతరావుకు చక్కని పొలం ఉందికానీ వానా కాలంలో మాత్రమే అక్కడ పచ్చదనం పరుచు కుంటుంది. వేసంగిలో సాగు చేయాలంటే నీటి కొరత. బోరు వేద్దామనుకున్నాడు కానీ సాధ్యం కాలేదు. చివరికి తన లాంటి వారి కోసం పనిచేస్తున్న ఎన్‌జీఓ సాయంతో బావిని తవ్వుకున్నాడు. ఆ తరువాత అతడి జీవితం ఇలా సంతోషంగా మారింది…
ఇంద్రవెల్లి పరిసర గిరిజన గ్రామాల్లో వాటర్ షెడ్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఏకలవ్య ఫౌండేషన్ ఈ ప్రాంతంలో మొత్తం 90 బావులను తవ్వించింది. వాటర్ షెడ్ ద్వారా భూగర్భ జలాల నిల్వలు పెరగడంతో ఈ బావులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. ఆ బావులను నమ్ముకుని సేద్యాన్ని చేస్తున్న రైతుల ముఖాలు కళకళలాడేలా చేస్తు్న్నాయి.

ఇంద్రవెల్లి మండలంలోని పాటగూడలో ఆత్రం అమృతరావు తన పొలంలో ఏకలవ్య ఫౌండేషన్ సహకారంతో బావిని తవ్వకున్నాడు. బావి తవ్వినప్పటి నుంచి ఏకాలమైనా సరే బావిలో నీరు పుష్కలంగా వుంటోంది. ఎర్రటి ఎండాకాలంలో కూడా బావిలో జలసిరి తరగకుండా వుండటం విశేషం. తనకు వరంగా లభించిన బావిని తనకు మాత్రమే సొంతం చేసుకోకుండా వాటర్ షేరింగ్ పద్ధతిలో తన పొరుగున వున్న మరో రైతుకు కూడా నీటిని వాడుకునే అవకాశం ఇస్తున్నాడు అమృతరావు. వాటర్ షెడ్, వాటర్ షేరింగ్ ద్వారా లభిస్తున్న ఫలితాలను  ఈ ఇద్దరు రైతులూ ఆస్వాదిస్తున్నారు.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *