ఇంట్లోనే ఎరువు తయారీ

Swach bharat mission team in a pit toilet @Gangadevipalli

”ఈ ఎరువు అచ్చం టీపొడిలా ఉంది. వేస్ట్‌ టు వెల్త్‌” అని ఆనందంగా అన్నారు, కేంద్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరమేశ్వరన్‌.

ఆయన ఏసీ గదిలో కూర్చుని ఈ మాట చెప్పలేదు. గంగదేవిపల్లిలోని లింగమూర్తి ఇంట్లోని మరుగు దొడ్డి గుంతలోకి దిగి అందులోని ఎరువును పరిశీలిస్తూ చుట్టూ ఉన్న గ్రామస్తులతో అన్నారు. అంతే కాదు ఆ ఎరువును పంటలకు ఎలా ఉపయోగిస్తున్నారో రైతులను అడిగి తెలిసుకున్నారు.
జాతిపిత గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి నిలువెత్తు నిదర్శనం గంగదేవి పల్లి.మానవ విసర్జితం నుండి సేంద్రియ ఎరువును తయారు చేసి స్వచ్ఛ భారత్‌కి ఆదర్శంగా నిలిచింది.

Swach bharat mission secretary parameswaran iyer takes out solidified manure from a pit toilet @gangadevipalli

Swach bharat mission secretary parameswaran iyer takes out solidified manure from a pit toilet @gangadevipalli

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన కొందరు ఐఎఎస్‌ అధికారులు హైదరాబాద్‌నుండి రెండు బస్సుల్లో వెళ్లి, 18.2.2017న వరంగల్‌ జిల్లా,గీసుకొండ మండలం, గంగదేవిపల్లిలో Twin pit technology (రెండుగుంతల మరుగుదొడ్లు) ను పరిశీలించారు.2000సంవత్సరంలో ఈ గ్రామంలో నిర్మించిన మరుగుదొడ్లలో ఒక గుంతలోని వ్యర్ధాలు ఎరువుగా మారాయి. ఆ గుంతలోకి దిగి ఎరువుగా మారిన ఆర్గానిక్‌ మాన్యూర్‌ను పరమేశ్వరన్‌ స్వయంగా చేతితో పరిశీలించారు. దేశంలో అందరికంటే ముందుగానే ఈ గ్రామీణులు వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత పై అవగాహన పెంచుకోవడం విశేషం.ఇక్కడ మూడేళ్ల నుంచే నూటికి నూరు శాతం మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నట్టు ‘బాలవికాస’ ప్రతినిధి శౌరిరెడ్డి చెప్పారు.
రెండు గుంతల మరుగుదొడ్లు అంటే?

గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లకు ఒక పెద్ద గుంతను తవ్వి మలవిసర్జితాలను అందులోకి పంపుతారు. అది నిండాక వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తీసేస్తారు. డబుల్‌ పిట్‌ పద్ధతిలో ప్రతి మరుగుదొడ్డికి 2 గుంతలు తవ్వుతా రు. ఒక్కోదానిని 6 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పుతో నిర్మిస్తారు.  ఒక గుంత నిండగానే పక్కనే ఉన్న మరో గుంతలోకి వ్యర్థాలను మళ్లిస్తారు. గుంత నిండిన ఏడాదిన్నర తర్వాత గుంతలోని నీరంతా ఇంకిపోయి Organic manure గా మారుతుంది. తర్వాత మూత తీసి గాలి తగిలేట్లు చేస్తారు. అలా ఒక్కో గుంతలో 60-80 కేజీల సేంద్రియ ఎరువు తయారవుతుంది. గ ంగదేవిపల్లిలో 2000లో డబుల్‌టాయ్‌లెట్‌ పిట్స్‌ను బాలవికాస స్వచ్ఛంద సంస్థ నిర్మించింది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *