ఆమెకు ఆసరా

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆమెకు ఆసరా
తూరుపు కోస్తా తీరంలోని  అచ్యుతా పురం మండలం, మడుకూరు గ్రామానికి చెందిన నాగమణి చురుకైన అమ్మాయి.ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత స్ధాయికి చేరుకోవాలనుకుంది కానీ కుటుంబ ఆర్ధిక పరిస్దితులు బాగా లేక 9వ తరగతి చదివి ఆపేసింది. డిగ్రీలు చదివినా ఉపాధిలేక నిరుద్యోగులుగా తిరుగుతున్న వారిని చూసి నాగమణి తన చదువుకు ఏం ఉద్యోగం దొరుకుతుందిలే అని పొలం పనులు చేసుకుందామని డిసైడ్‌ అయింది. కానీ ఆమె జీవతం అనుకోని మలుపు తిరిగింది.
తమ ప్రాంతంలోని ‘ బ్రాండిక్స్‌’లో చిన్న అవకాశం దొరికింది. పనిలో ఆమె చూపిన ప్రతిభకు టెక్నిషియన్‌గా ప్రమోట్‌ అయింది. హ్యాపీగా ఉద్యోగం చేసుకంటుంటే…

ఆమె పాపకు అనారోగ్యం కలగడంతో విశాఖలోని మణిపాల్‌ ఆసుపత్రిలో చేర్పించింది. పాప చికిత్సకు దాదాపు అరవై వేల రూపాయలు ఖర్చవుతుందన్నారు వైద్యులు. అపుడే ఉద్యోగంలో నిలదొక్కుకుంటున్న పేద మహిళ ఇంత ఖర్చు భరించగలదా? ఆమె కష్టాన్ని చూసిన బ్రాండిక్స్‌ యాజమాన్యం ఆసుపత్రి బిల్లులు కట్టడానికి ముందుకు వచ్చి నాగమణికి ఆసరాగా నిలిచింది. బిడ్డ కోలుకుంది. నాగమణి సంతోషంగా ఉద్యోగం చేసుకుంటుంది. ఉద్యోగుల శ్రమనే కాదు వారి సమస్యలను గుర్తించినపుడే కంపెనీ ప్రగతి వైపు అడుగులు వేస్తుంది.
అందుకే బ్రాండిక్స్‌ విజయం వెనుక 18వేల మహిళలున్నారు.

Share.

Leave A Reply