ప్రాణదాతలకు ఆసరా కావాలి ?

At Pittabongaram primary health centre, it was found that one of the medical officers was leaving the hospital at 12 noon without working for full day.

ఎవరికీ పట్టని పల్లెల్లో పసిబిడ్డలకు  జబ్బులు చేస్తే వారికి మందులిచ్చి ప్రాణాలు కాపాడే తల్లులే వీరు.

కానీ వీరికి నిత్యం జీవన్మరణమే…

పిట్టబొంగరం(adilabad dist,telangana) అనే ఊర్లో ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో పని చేస్తున్న ఈ ప్రాణదాతలు ‘రూరల్‌మీడియా’తో ముచ్చటిస్తూ,
” రోజూ నాలుగు గ్రామాలు తిరగాలన్నా, అన్నీ రిమోట్‌ తండాలే, వాగులు,వంకలు దాటాలి. మైళ్లదూరం కాలినడకన మందుల బ్యాగులు మోస్తూ పోవాలి.ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని మందులివ్వాలి.

మాకు కనీసం ఆటోఛార్జీలు కూడా ఇవ్వరు.అతి తక్కువ జీతాలు.

phc-staff-pittabongaram

phc-staff-pittabongaram

అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోరు” అని ఆవేదన నిండిన స్వరంతో అన్నారు.

అసలు రహదారులే లేని చోటుకు కూడా కిలో మీటర్ల దూరం నడిచి మహిళల ఆరోగ్య బాగోగులు చూసుకోవడం ఈ ఎఎన్‌ఎంల పని. దాదాపు 4వేల మందికి సేవలందించాలి.కనీసం 5 గ్రామాలకు నిత్యం ఇరవై కిలో మీటర్లుకు పైగా తిరగాలి.ఇందు కోసం వీరంతా షేర్‌ ఆటోలు మీద ఆధారపడాలి.దీని వల్ల చిన్నారులకు, గర్భిణులకు సకాలంలో సేవలు అందించ లేక పోతున్నారు.
ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారుచేస్తున్న వీరు అనారోగ్యం పాలైతే నష్టం మనకే…

(pics/k.rameshbabu/ruralmedia/adilabad)

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *