రాజధాని ఉత్సవానికి రాజీవ్‌సేధీ కళ

Google+ Pinterest LinkedIn Tumblr +

సీఎంతో చంద్రబాబుతో రాజీవ్ సేథీ భేటీ

ప్రముఖ ఆర్ట్ క్యూరేటర్ రాజీవ్ సేథీ శనివారం విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.

work-rajeev

work-rajeev

సీఆర్ డీఏ సమావేశం సందర్భంగా సీఎం కలిసిన రాజీవ్ సేథీ తన అనుభవాలను, ఆయనతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన చిత్ర కళలపై తాను చేసిన పరిశోధనల గురించి వివరించారు. అక్టోబర్ 22న ప్రధాని శ్రీ నరేంద్రమోడీ చేతుల మీదుగా జరిగే రాజధాని నగర శంకుస్థాపన ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. వేల సంవత్సరాలకు పూర్వం మన కళాకారులు తీర్చిదిద్దిన అపురూప కళాఖండాలను శంకుస్థాపన సందర్బంగా ప్రదర్శించడం ద్వారా మరోసారి తెలుగు జాతి ప్రాశస్థ్యం మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకు రావాలన్నారు.

52 దేశాలలో 500ల గ్రూపులతో తాను కలిసి పనిచేశానని సేథీ ముఖ్యమంత్రికి వివరించారు. అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన కళాకారులు, ఆర్కిటెక్ట్ లు తనతో కలిసి పనిచేశారని తెలిపారు. శంకుస్థాపన వేడుకకు హాజరయ్యే ప్రజలకు ఏర్పాట్లు, ప్రాంగణాల అలంకరణ, సభావేదిక డిజైన్ పై వారిరువురు చర్చించారు. ప్రతి గ్రామం నుంచి పవిత్ర కలశాలు సేకరించి తెచ్చిన నీరు, మట్టిని పైలాన్ వద్ద నిక్షిప్తం చేసి రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను రాజధాని నిర్మాణంలో సజీవం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ను ప్రతిబింబించేలా సూర్యోదయం బాక్ డ్రాప్ తో వేదిక ఉండాలన్నారు. రాజీవ్ సేథీ మాట్లాడుతూ మేకిన్ ఇండియా, మేడిన్ ఆంధ్రప్రదేశ్ కొత్తవేమి కాదంటూ మన చేతి వృత్తులకు ప్రపంచంలో ఉన్న ఆదరణ గురించి తన అనుభవాలను వివరించారు. ఏటికొప్పాక, మచిలీపట్నం, రేపల్లె, ధర్మవరం, లేపాక్షి, కొండపల్లి కళాకారుల గొప్పదనాన్ని వివరిస్తూ సేథీ బృందం ఇచ్చిన ప్రజెంటేషన్ ను ముఖ్యమంత్రి తిలకించారు.

Share.

Comments are closed.