పారిశ్రామిక వాడగా శ్రీసిటీ, ప్రజా రాజధానిగా అమరావతి

2Chandrababu Naidu at Mondelez plant in Sri City

పారిశ్రామిక వాడగా శ్రీసిటీ, ప్రజా రాజధానిగా అమరావతి 
( చిత్తూరు జిల్లా శ్రీసిటీ నుండి) 
పారిశ్రామిక వాడగా శ్రీసిటీ, ప్రజా రాజధానిగా అమరావతి అంతర్జాతీయ స్ధాయిలో శాశ్వతంగా నిలుస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. 
ఆసియాలోనే అతిపెద్ద మాండలెజ్‌ ఇండియా ఫుడ్స్‌ (క్యాడ్‌ బరీ) తయారీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి శ్రీసిటీ సెజ్‌లో (25.4.2016) ప్రారంభించి మాట్లాడుతూ, 
” శ్రీసిటీ పరిశ్రమలకు అత్యంత అనువైనది, అంతర్జాతీయ స్దాయి ప్రమాణాలకు అనువుగా రూపుదిద్దుకున్నది, అందుకే ప్రపంచ స్ధాయి సంస్దలు వస్తున్నాయి. 3నగరాలను కలిపే పారిశ్రామిక కారిడార్‌ని ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాన్ని కలుపుతూ నెల్లూరు,చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే రూపు దిద్దుకోబోతున్నది. ఇప్పటికే శ్రీసిటీలో 80 కంపెనీల్లో ఉత్పత్తులు ప్రారంభించాయి, మరో 40 కంపెనీలు నిర్మాణ దశలో ఉన్నాయి.35 వేల మందికి ఉద్యోగావ కాశాలు లభించాయి, దీని వల్ల 25వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

 AP, CM opens Mondelez manufacturing plant in Sri City

AP, CM opens Mondelez manufacturing plant in Sri City

దేశ స్దాయిలోనే ఇండస్ట్రియల్‌ టౌన్‌ షిప్‌ అంటే శ్రీసిటీ ఒక్కటేనని గుర్తించేలా తీర్చి దిద్దడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో నీరు,విద్యుత్‌ సౌకర్యాలు మెండుగా ఉన్నాయి. కృష్ణపట్నం పవర్‌ ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతుంది, ఆసియాలోనే అతి పెద్ద ”మాండలెజ్‌ ఇండియా ఫుడ్స్‌” శ్రీసిటీకి రావడం అభినందనీయం. గ్రామీణ మువతకు శిక్షణ ఇచ్చి 1600 మందికి ఉపాధి కల్పించిన సంస్ద ప్రతినిధుల సేవాభావం గొప్పది. 
2.5లక్షల టన్నుల ఉత్పతి ్త లక్ష్యం 
కోస్తాలో సెజ్‌ టౌన్‌ షిప్‌లు, రాయల సీమను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దనున్నాం, ప్రస్తుతం 23 హెక్టార్లలో కొకొ పండిస్తున్నామని తెలిపారు.

Chandrababu Naidu at Mondelez plant in Sri City

Chandrababu Naidu at Mondelez plant in Sri City

పాల ఉత్పత్తిలో ఏపీ మొదటి స్దానంలో ఉంది.చాక్లెట్‌ ఉత్పత్తులకు అవసరమైన పాల పొడికి కొరత లేదని తెలిపారు.70 ఏళ్ల చరిత్ర ఉన్న క్యాడ్‌బరీ కంపెనీ ప్రస్తుతం ఇక్కడ 1600మందికి ఉపాధి కల్పించడంతో పాటు, 2020 నాటికి 2లక్షల 50వేల టన్నుల చాక్లెట్లు ఉత్పత్తి ని సాధించడం లక్ష్యం పెట్టుకున్నారు ” అని చంద్రబాబు వెల్లడించారు. 
ఈ కార్యక్రమంలో శ్రీసీటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి, మాండలీజ్‌ ప్రతినిధులు డానియల్‌ మైర్స్‌, మౌరిజియో పాల్గొన్నారు. 
సీఎంతో సెల్ఫీలు 
అంతకు ముఖ్యమంత్రి ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. మాండలీజ్‌ కంపెనీలో ఉపాధి పొందుతున్న స్దానిక మహిళలు సీఎంతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు,

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *