‘మహాసముద్రం’ లో చైతన్య కెరటం

Google+ Pinterest LinkedIn Tumblr +

చిత్తూరు నడిబొడ్డులో ఉన్న ఆ బంగ్లాలోకి అడుగు పెట్టగానే,

‘ మీరేనే హైదరాబాద్‌ నుండి వచ్చింది?’ అని అటెండర్‌ ఎదురొచ్చి లోపలికి తీసుకెళ్లాడు. కొన్ని ఫొటోలున్న ఆల్బంతో శిల్పా గారొచ్చారు. ” మీ రూరల్‌ కేస్‌స్టడీలు చదివాను.. ఈ స్టోరీ కూడా ఆలాంటిదే..” అన్నారామె.

‘అంగన్‌వాడీ అనేది దేశవ్యాప్తంగా ఉన్న సిస్టమ్‌ దానిని మార్చడం రిస్కేమో… మేడం ? ‘ అన్నాను.
‘ నిజమే కానీ, పేద తల్లులు కూలీకెళితే వాళ్ల పిల్లల ఆలనాపాలనా కోసం ఏర్పాటుచేసేవే అంగన్‌వాడీలు. వాటిల్లో కాస్త చదువు కూడా చెప్పాలి కానీ, అవి అలా లేవు. అందుకే ఈ రిస్క్‌ తీసుకొన్నాను….” అని ఆమె చెప్పడం మొదలు పెట్టారు.
ఆమె ఒక తరాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తున్నారని ఆ క్షణంలో నేను ఊహించలేదు.
సీన్‌ కట్‌చేస్తే…. 
అంగన్‌వాడీల్లో, సరైన సౌకర్యాలు లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి, వాటినోసారి చూడాలి అనిపించింది ఆమెకు.
”చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం సమీపంలో మహాసముద్రం గ్రామంలో ఓ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లా. అక్కడంతా ముళ్లపొదలు, చుట్టూ అపరిశుభ్రత.. ఇంత దుర్భర పరిస్థితిలో ఈ పిల్లలు ఎలా ఎదుగుతారు? వారి భవిష్యత్‌ ఏమవుతుంది ? అని ఆలోచించినపుడు ఆ అంగన్‌వాడీ కేంద్రాన్ని దత్తత తీసుకోవడం ఒక్కటే మార్గం అని అప్పుడే నిర్ణయించుకున్నా…’ అన్నారు శిల్ప.
సమాజంలో అవసరాలు మార లేదు.పారిశుద్ద్యం,పౌష్టికాహార లోపమూ,పేదరికమూ ఎప్పుడూ ఉండే సమస్యలే.అయితే సమస్యల పట్ల అవగాహన ఉండి,పరిష్కారం దిశగా ఆలోచిస్తే మార్పు వస్తుందని నిరూపించారు ఆమె.
ప్రభుత్వాలు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతో ఖర్చు చేస్తున్నాయి కానీ, పలు కారణాల వల్ల చేరవలసిన వారికి అవి పూర్తిగా చేరడం లేదు. అలాంటి చోట ఆమె చొరవ తీసుకొని పథకాల అమలు సమర్ధవంతంగా జరిగేలా చూశారు. అనుకున్నట్టే మూడు నెలల్లో ఆ కేంద్రాన్ని సమూలంగా మార్చేశారు.
ఇంద్రధనుస్సులా … 
వారానికోసారి తన ఇద్దరు పిల్లలతో అక్కడికి వెళ్లడం మొదలు పెట్టారు.కూలడానికి సిద్ధంగా ఉన్న గోడలతో శిథిలావస్థకు చేరుకున్న అంగన్‌ వాడీ కేంద్రాన్ని ఆధునికీకరించే పని మొదలు పెట్టారు. కొత్త భవనం నిర్మించి, పిల్లలు మెచ్చే రంగులు వేయించారు. ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో సూక్ష్మసేద్యంతో మొక్కలు,కూరగాయలు పెంచారు.   పూర్తి కథనం ‘ఆదివారం ఆంధ్రజ్యోతి'(28.10.2018) లో చదవండి.

before anganwadi

before anganwadi

after anganwadiస

aj-sunday-28.10.2018

aj-sunday-28.10.2018

Share.

Leave A Reply