ఇద్దరు చంద్రులు కలసిన వేళ

Andhra Pradesh CM Sri Chandrababu Naidu called on CM Sri K Chandrashekar Rao

 

అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావును ఆహ్వానించారు. శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందించారు. ఆదివారం సాయంత్రం క్యాంపు కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుష్పగుచ్చం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, టిటిడిపి నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. క్యాంపు కార్యాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు..రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, కె.తారకరామారావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, టిడిపి నాయకులు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు. తిరుపతి నుంచి తెచ్చిన లడ్డూలను చంద్రబాబునాయుడు కేసీఆర్‌కు అందజేశారు.  అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహణపై చంద్రబాబు వివరించారు.

Related posts