ఆంధ్ర పక్షమా..?కేంద్ర పక్షమా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజకీయ పరిణామాలపై టెలికాన్ఫరెన్స్ లో

ముఖ్యమంత్రి చంద్రబాబు 

అమరావతి,(ruralmedia)

‘‘అమిత్ షా లేఖకు అసెంబ్లీలోనే సమాధానం ఇచ్చాను.ఆ లేఖ మొత్తం అబద్దాలే,ఒక్కటి కూడా నిజంలేదు.బిజెపితో మనం పొత్తు పెట్టుకుందే రాష్ట్రం కోసం,ప్రజా ప్రయోజనాల కోసం.అలాంటిది నాలుగేళ్లు అయినా అది నెరవేరలేదు.ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేంద్రాన్ని మనం హోదా అడగడం బిజెపికి నచ్చడంలేదు.ప్రత్యేక ఆర్ధిక సహాయానికి అప్పుడు ఎందుకు అంగీకరించాం. హోదాకు సమానంగా ఇస్తామంటేనే ఆర్ధికసాయానికి ఒప్పుకున్నాం.హోదా ఎవరికీ ఇవ్వవద్దని ఆర్ధికసంఘం చెప్పిందని వక్రీకరించారు.ఈఏపీలకు నిధులు ఇస్తామని చెప్పి కనీసం మెమో కూడా ఇవ్వలేదు,మార్గదర్శకాలు కూడా ఇవ్వలేదు.నాలుగేళ్లయ్యాక ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ అంటున్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

హోదా ఇవ్వడం లేదని మనకు చెప్పి ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిధులు కొనసాగిస్తున్నారు.జిఎస్టిలో కూడా ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక లబ్ది చేకూరుస్తున్నారు.ఏపికి అన్యాయం చేశారు.ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చేవన్నీ ఏపీకి కూడా ఇవ్వడం బిజెపికి ఇష్టంలేదు.రాష్ట్రానికి నిధుల కోసం నాలుగేళ్లుగా కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాం. తొలి బడ్జెట్ లోనే రెక్కలు విరిచి ఎగరమంటే ఎలా అని కేంద్రాన్ని ప్రశ్నించాను,నాలుగేళ్ల క్రితమే కేంద్రాన్ని నిలదీశాను.తొలిబడ్జెట్ లోనే గొడవపడితే రాజకీయం అంటారనే ఇన్నాళ్లు ఆగాం.4బడ్జెట్ లు చూసినా ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయలేదు.నాలుగేళ్లుగా నిధుల కోసం,హక్కుల కోసం పోరాడుతున్నాం.29సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని ఆదుకోమన్నాం,అయినా కేంద్రంలో స్పందన లేదు.అందుకే  కేంద్రం నుంచి బైటకొచ్చాం.ఎన్డీఏ నుంచి వైదొలిగాం. నిధులు రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం.విధిలేని పరిస్థితుల్లోనే పోరాటమార్గం పట్టాం.

యూసీలు ఇవ్వలేదనడం పచ్చి అబద్ధం:

కేంద్రం ఇచ్చిన నిధులు అన్నింటికీ యూసీలు ఇచ్చాం.యూసీలు ఇవ్వలేదు కాబట్టే నిధులు ఆపామనడం పచ్చి అబద్దం,దుర్మార్గం.యూసీలు ఇవ్వలేదని రుజువుచేస్తే ఎంపీగా రాజీనామా చేస్తానని సీఎం రమేష్ సవాల్ చేశారు. లేకుంటే మీరు రాజీనామా చేస్తారా అంటే బిజెపి ఎంపీ జివిఎల్ వెనక్కితగ్గారు.ఆర్ధికలోటుకు యూసీలు ఇవ్వనవసరంలేదు.వెనుకబడిన జిల్లాలకిచ్చిన 1,050కోట్లలో 940కోట్లకు యూసిలిచ్చాం.ఆ తరువాతే మరో రూ.350కోట్లు విడుదల చేశారు.యూసీలు ఇవ్వకపోతే తరువాత వాయిదా విడుదల చేసేవారు కాదు.కానీ ఇచ్చిన రూ.350కోట్లు పీఎంవో అనుమతి లేదని మళ్లీ వెనక్కి తీసుకోవడం అన్యాయం.అమరావతికిచ్చిన రూ.1,000కోట్లకు యూసీలు ఇచ్చాం.గుంటూరు,విజయవాడకిచ్చిన నిధుల్లో 350కోట్లకు యూసీలు ఇచ్చాం.ఇచ్చిన నిధులకు యూసీలు ఇవ్వలేదనే బిజెపి ఆరోపణలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి.యూసీలు ఇవ్వడంలో దేశంలోనే ముందున్న 3వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్.నాలుగేళ్లుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయం ప్రజలకు వివరించాలి.

విజయ్ మాల్యా పరారయ్యాడు-విజయసాయి పీఎంలో ఉంటున్నాడు:

విజయ్ మాల్యాకు ఒక న్యాయం..?విజయసాయి రెడ్డికి మరో న్యాయమా..? కేంద్రాన్ని సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.ఇద్దరూ ఆర్ధిక నేరస్థులే..వారిమధ్య వ్యత్యాసం ఏమిటి..?

విజయ్ మాల్యా దేశం వదిలి పరారయ్యాడు,విజయసాయి పీఎంవోలో ఉంటున్నారు..ఏమిటీ వ్యత్యాసం..? విజయ్ మాల్యా సభ్యత్వం రద్దుచేశారు. విజయసాయి సభ్యత్వం కొనసాగిస్తున్నారు..ఏమిటీ వ్యత్యాసం..?

కావాలనే బిజెపి నేతలు టిడిపిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.గతంలో ఇవే ఆరోపణలు వైసీపి చేసినప్పుడు టిడిపిని సమర్ధించిన బిజెపి నేతలే ఇప్పుడు అవే ఆరోపణలు చేయడాన్ని ప్రజలు అర్ధం చేసుకున్నారు.బిజెపిపై అవినీతి ఆరోపణలకు జవాబివ్వకుండా, టిడిపిపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదం.బిజెపి చేస్తున్న ఆరోపణలను టిడిపి నేతలు ఖండించాలి,వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలి.

చట్టంలో అంశాలు,పార్లమెంటు ఇచ్చిన హామీలు అమలు చేయమన్నాం. దానికి బిజెపికి ఎందుకు అంత కోపం వస్తోంది..? ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు అన్యాయం చేస్తున్నారు..?

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలి.రాష్ట్రం కోసం పోరాడుతుంటే ఎందుకు విమర్శిస్తున్నారు…?రాష్ట్రంలో అభివృద్ది ఆగిపోరాదు.అదే సమయంలో ప్రజల సెంటిమెంట్ గౌరవించాలి.

ఆంధ్ర పక్షమా..?కేంద్ర పక్షమా..? పార్టీల నేతలు తేల్చుకోవాలి:

ఆంధ్రపక్షమా…?కేంద్రపక్షమా…? ఆయాపార్టీల నేతలే తేల్చుకోవాలి.ప్రజల కోసం పోరాడే ముఖ్యమంత్రి పక్షాన ఉంటారా..? రాష్ట్రానికి అన్యాయం చేసే కేంద్రం పక్షాన ఉంటారా..?వివిధ పార్టీల నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.ప్రజల హక్కుల కోసం పోరాడే టిడిపి పక్షాన ఉంటారా..?ప్రజల మనోభావాలను నిర్లక్ష్యం చేసిన బిజెపివైపు ఉంటారా..?తెలుగుదేశం పార్టీకి మద్ధతునిస్తే రాష్ట్రానికి మద్ధతునివ్వడమే.టిడిపిని బలహీన పరిస్తే రాష్ట్రాన్ని బలహీనపరచడమే అనేది అందరూ గుర్తుంచుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలు,పార్టీ నేతలతో పేర్కొన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు,ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్,ఎంపీలు సీఎం రమేష్,అవంతి శ్రీనివాసరావు,జాతీయ పార్టీ అధికార ప్రతినిధి కంభంపాటి రామమోహన రావు,ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పార్టీ ప్రచార సారథులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

Share.

Leave A Reply