Alternative Agriculture…

bhoslerekha_sanjeev_lingapor

మట్టిలో సారం ఉంటే , మనం తినే తిండిలో కూడా పోషకాలు ఉంటాయంటారు…భోస్లే రేఖ, సంజీవ్‌. అందుకే రసాయన ఎరువులతో ఈ భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి సహజమై పద్దతిలో తేవడానికి వానపాములతో స్నేహం చేశారు. పశువుల పేడ,మూత్రాలను పొలంలో పారించడంతో ఆ వాసనకు ఎరలు నేల పైకి వచ్చి వర్మీకంపోస్టుని ఈ రైతుకు అందిస్తున్నాయి. సోయాతో పాటు, టమాటా,మిర్చీ పండిస్తున్న తీరును లింగాపూర్‌ (ఆదిలాబాద్‌ జిల్లా) లో మాకు చూపించారు.

ఆహారాన్ని విషం చేస్తున్న రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళాలని ఏకలవ్య ఫౌండేషన్‌ రైతులకు నిరంతరం చెబుతూ వుంటుంది. రైతులకు చెప్పడం మాత్రమే కాదు.. తాను కూడా ఆచరిస్తోంది. గుడిహత్నూర్‌ మండలం, లింగాపూర్‌లోని మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రయోగాత్మకంగా చేస్తోంది. ఈ క్షేత్రంలో పత్తి, సోయా, కందులు, మిర్చి, టొమేటో, వంకాయలతోపాటు షుగర్‌ లెస్‌ రైస్‌ కూడా పండిస్తున్నది. ఈ వ్యవసాయ క్షేత్రం గురించి తెలిసిన వారు దిగుబడులను ఆసక్తిగా కొనుగోలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఈ ఆదర్శ వ్యవసాయ క్షేత్రంలో ఒక గిరిజన కుటుంబానికి ఉపాధి కల్పించారు. వారు పంటల సాగులో మమేకమవుతున్నారు.
గుడిహత్నూర్‌ మండలం, లింగాపూర్‌లోని మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రయోగాత్మకంగా చేస్తోంది. ఈ క్షేత్రంలో పత్తి, సోయా, కందులు, మిర్చి, టొమేటో, వంకాయలతోపాటు షుగర్‌ లెస్‌ రైస్‌ కూడా పండిస్తున్నది. ఈ వ్యవసాయ క్షేత్రం గురించి తెలిసిన వారు దిగుబడులను ఆసక్తిగా కొనుగోలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఈ ఆదర్శ వ్యవసాయ క్షేత్రంలో ఒక గిరిజన కుటుంబానికి ఉపాధి కల్పించారు. వారు పంటల సాగులో మమేకమవుతున్నారు.
”ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తాన్ని నేను, నా భార్య జాగ్రత్తగా చూసుకుంటాం. రసాయనిక ఎరువులు లేని అమతాహారాన్ని పండిస్తున్న సంతప్తి మా ఇద్దరికీ వుంది. గతంలో మేం సొంతగా వ్యవసాయం చేసినప్పుడు డబ్బు కోసమే వ్యవసాయం అన్నట్టుగా రసాయనాలను
ఉపయోగించి వ్యవసాయం చేసేవారము. మేం ఎంత పొరపాటు చేశామో ఇప్పుడు మాకు అర్థమవుతోంది. సహజ ఉత్పత్తులను పండిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మేం తినడమే కాక అందరికీ ఇస్తున్నాం. ఇది మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది”. సంజీవ్‌, భోస్లే రేఖ
…………

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *