APబ్రాండ్ అంబాసిడర్లుగా అజయ్ దేవ్‌గణ్, కాజోల్

Ajay devagan today met Andhra Pradesh Chief Minister N.Chandrababu

ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లుగా అజయ్ దేవ్‌గణ్, కాజోల్

  • వర్చువల్ స్టూడియో నిర్మాణానికి సంసిద్ధత
  • అమరావతిలో మీడియా సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు

విజయవాడ, ఏప్రిల్ 12:(rural media) ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగ ప్రచారకర్తలుగా ప్రముఖ బాలీవుడ్‌ నటులు అజయ్‌దేవగణ్‌, కాజోల్‌ దంపతులు వ్యవహరించనున్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయిన అజయ్‌దేవ్‌గణ్‌ ప్రపంచప్రమాణాలతో నిర్మాణమవుతున్న అమరావతి నగరం, ఏపీలోని ఆకర్షణీయ పర్యాటక ప్రదేశాల పట్ల ఉత్సుకత చూపించారు. అమరావతికి, ఏపీ పర్యాటకరంగానికి తన జీవిత భాగస్వామి, ప్రముఖ నటి కాజోల్‌తో కలిసి ప్రచారకర్తలుగా పనిచేస్తామని ప్రతిపాదించగానే, ముఖ్యమంత్రి అందుకు సంతోషంగా అంగీకరించారు. ఎన్నో అందమైన ప్రదేశాలకు, వనరులకు పెట్టింది పేరుగా వున్న ఆంధ్రప్రదేశ్ పర్యాటకరంగం అజయ్ దేవ్‌గణ్-కాజోల్ ప్రచార నిర్వహణతో శోభిల్లగలదన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తంచేశారు.

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిలో ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా సిటీ ప్రాజెక్టును చేపట్టేందుకు అజయ్‌దేవగణ్‌ ఈ సందర్భంగా సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రతిపాదిత సిటీ గురించి తన బృందంతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను విలక్షణమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అజయ్‌దేవగణ్‌తో అన్నారు. బాలివుడ్ ప్రముఖులు పలువురు అమరావతి పట్ల కనబరుస్తున్న ఆసక్తి పట్ల సంతోషాన్ని వెలిబుచ్చారు. దుబాయ్, సింగపూర్, మలేషియా వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు నాయకత్వ పటిమతో ఎదిగాయని, మన దేశంలో దృఢమైన నాయకత్వంతో పాటు అపరిమితమైన ప్రతిభా సామర్ధ్యం అదనపు బలమని అన్నారు. అమరావతి ప్రతిపాదిత నవ నగరాలలో ఎంటర్‌టైన్‌మెంట్-మీడియా సిటీ కూడా ఒకటని, గ్లోబల్ సిటీగా, ఇన్నోవేటీవ్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. లాజిస్టిక్ హబ్‌గా, తూర్పుతీర ముఖద్వారంగా మారనున్న ఏపీ రానున్న కాలంలో పర్యాటక, వినోదరంగానికి కేంద్ర స్థావరంగా మారనున్నదని అన్నారు. అందుకోసం వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుంటామని చెప్పారు. భారతదేశంలో భారీ ప్రాజెక్టులు ఏవి తలపెట్టినా అభివృద్ధి నిరోధక శక్తులు అడ్డుపడతాయని, అమరావతి నగరం కోసం రైతులు భూ సమీకరణకు ముందుకొచ్చి స్వార్థ రాజకీయాలను సమర్ధంగా తిప్పికొట్టడం ద్వారా ఒక కొత్త శక్తిని, ఉత్సాహాన్ని అందించారని అన్నారు. రైతుల త్యాగనిరతిని అజయ్ దేవ్‌గణ్ కొనియాడారు. దూరదృష్టి వున్న సమర్ధ నాయకుడు దొరకడం ఏపీ ప్రజల అదృష్టమని ప్రశంసించారు. దుబాయ్ తరహాలో వర్చువల్ టెక్నాలజీతో కూడిన స్టూడియో నిర్మాణాన్ని ఏపీలో చేపట్టబోతున్నట్టు ఈ సందర్భంగా అజయ్ దేవ్‌గణ్ ప్రకటించారు.

సీఆర్‌డీఏ మ్యాపింగ్‌లో లైడార్ టెక్నాలజీ

ఇలావుంటే, ఏపీలో లైడార్ టెక్నాలజీని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టడానికి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సంసిద్ధత వ్యక్తంచేశారు. ఈ టెక్నాలజీని రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి సర్వే ఆఫ్ ఇండియా తరుపున ముందుకొచ్చిన సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ స్వర్ణ సుబ్బారావును సీయం అభినందించారు. స్మార్ట్ సిటీలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి ఈ తరహా సాంకేతికత విస్తృతంగా ఉపయోగపడుతుందని డాక్టర్ స్వర్ణ సుబ్బారావు ముఖ్యమంత్రికి వివరించారు. సీఆర్‌డీఏ ఏరియా మ్యాపింగ్ లోనూ, రహదారి నిర్మాణాల ప్రణాళికలోనూ ఈ లైడార్ టెక్నాలజీ ఉపయోగం అనితర సాధ్యంగా వుంటుందని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా నిపుణుల బృందం ఈ టెక్నాలజీని పరిచయం చేయడానికి వీలుగా ఒకటీ, రెండు రోజుల్లో సీఆర్‌డీఏ ప్రాంతంలో పర్యటిస్త్తుందని తెలిపారు.

Bollywood actor Ajay devagan today met Andhra Pradesh Chief Minister N.Chandrababu Naidu at CM office in Vijayawada.

 Ajay devagan today met Andhra Pradesh Chief Minister N.Chandrababu

Ajay devagan today met Andhra Pradesh Chief Minister N.Chandrababu

Related posts

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *