75శాతం దళితుల భూముల్లో సాగు లేదు?

Release of Telangana State Development Report 2017 on 12.05.2017 ,first of its kind for a State
 • 75శాతం దళితుల భూముల్లో సాగు లేదు
  ………………………………………………….
  తెలంగాణా సామాజిక అభివద్ధి నివేదిక వెల్లడి
 • బడుగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రంలో 460 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనమని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. సామాజిక ఆర్ధిక మండలి రూపొందించిన’ తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదిక 2017’ను హైదరాబాద్‌లో శుక్రవారం(12.5.2017)మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.పి ఆచార్య,సీఎస్‌డి అధ్యక్షుడు ముచుకుంద్‌ దూబె,డైరెక్టర్‌ కల్పనా కన్నాభిరాన్‌ పాల్గొన్నారు.
  తెలంగాణా సామాజిక అభివద్ధి నివేదిక లోని ముఖ్యాంశాలు
  ……………………………………………………
  తెలంగాణ ప్రభుత్వ, ప్రణాళికా విభాగం కోసం హైదరాబాదులోని తెలంగాణ సామాజిక అభివద్ధి మండలి ఈ నివేదికను రూపొందించింది. ఇదిపూర్తిగా తెలంగాణకే ప్రత్యేకమైనది. భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ ఇటువంటి నివేదిక లేదు. నివేదికలోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి.
  2011నుండి 2014 వరకు చేపట్టిన సర్వేలలోని సమాచారం ఆధారంగా ప్రభుత్వం అత్యవసరంగా దష్టిపెట్టాల్సిన ముఖ్యాంశాలను ఈ నివేదిక సూచించింది.
 •  

   

  రాష్ట్రంలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2001-2011మధ్యకాలంలో భారత దేశంలో జనాభా పెరుగుదల రేటు 13.6శాతం తగ్గితే, తెలంగాణలో మాత్రం 17.6శాతం తగ్గింది.

  తెలంగాణలో అత్యధిక శాతం (61శాతం) ప్రజలు గ్రామాల్లోనే ఉన్నారు.

   

   

  నగరాల్లో సమస్యలుః

   

  –  నగరాల్లో పేదల జీవన ప్రమాణాలు మెరుగు పరచాల్సిన ఆవశ్యకత ఉన్నది.

  -తెలంగాణలో పట్టణాలు శరవేగంతో పెరిగాయి.
  అంతకు ముందు 88పట్టణాలుండేవి. అవి 158కి పెరిగాయి. పట్టణాలు 93శాతం పెరిగాయి.
  – నగరజనాభాలో 30శాతం మంది ఒక్క హైదరాబాదులోనే ఉన్నారు.
  –  అత్యధిక మురికివాడలు గల నగరంగా హైదరాబాద్‌ గుర్తించబడినది
  – వద్ధుల సామాజిక భద్రతకు ఒక వ్యవస్థ ఏర్పాటు అవశ్యం,
  ఇది అత్యధిక ప్రాథాన్యత గల అంశం
  –  2001-2011మధ్యకాలంలో తెలంగాణలో వద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
  – వద్ధుల్లో పురుషుల కంటే కూడా, స్త్రీల సంఖ్యే ఎక్కువ.
  ఆడమగ శిశువుల నిష్పత్తి
  –  ఆడశిశువుల జననం రేటు తగ్గిపోతోంది.

  -సమాజంలో ఆడశిశువుల స్థానం, ఆడశిశువు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. స్త్రీ, పురుష నిష్పత్తి మెరుగు పడినా, ఆడ, మగ శిశువుల నిష్పత్తి మెరుగుపడలేదు. పురుషులు వెయ్యిమంది ఉంటే, స్త్రీలు 971మంది ఉండేవారు. ఇప్పుడు వీరి సంఖ్య 988కి పెరిగింది. వెయ్యిమంది మగశిశువులకు 957మంది ఆడశిశువులు ఉండే వారు. వీరి సంఖ్య933 కి తగ్గిపోయింది. దీనిలో హైదరాబాదు, నల్గొండ, వరంగల్‌,పాలమూరు జిల్లాలు ముందున్నాయి.
  వివాహాలు
  –  నగరీకరణ చెందిన హైదరాబాదు ,రంగారెడ్డి జిల్లాల్లో సైతం 18 ఏళ్లు నిండకుండానే బాలికలకు వివాహాలు చేస్తున్నారు.
  –  20-29 ఏళ్ల మధ్య వయసులో కేవలం 46శాతం మంది పురుషులు మాత్రమే వివాహితులు. అయితే, వయసుగల స్త్రీలలో 76శాతం మంది స్త్రీలు వివాహితులు.
  –  60 ఏళ్ల వయసులో భార్యల్ని కోల్పోయిన పురుషులు 11 శాతం మంది ఉండగా, ఇదే వయసులో భర్తలు పోయి వితంతువులు అయిన వారు 57శాతం మంది ఉన్నారు.
  జనాభా సమాచారం
  అ వికలాంగుల సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువ
  భూమి… వ్యవసాయం
  – అ 2002-2012మధ్యకాలంలో తెలంగాణ మొత్తం గ్రామీణ ప్రాంత గహస్థుల్లో 43.3శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేద కుటుంబాల వారు.
  – ఎస్సీలకు భూమి అందుబాటు చాలా తక్కువ
  – 75శాతం ఎస్సీల భూముల్లో సాగు యోగ్యమైనది ఒకహెక్టారు కూడా లేదు.
  – ఎస్సీలకు కౌలుకి ఇచ్చే భూములు కూడా చాలా స్వల్పం
  – పంటలు కూడా చాలా తక్కువ
  – నీటి సదుపాయాలు కూడా తక్కువ. ఎస్సీల్లో 25.4 శాతం. ఎస్టీల్లో 29.9 శాతం. ఇతరుల్లో 36.9శాతం.
  – తెలంగాణలో బ్యాంకుల వంటి వ్యవస్థా గతమైన సంస్థల ద్వారా పరపతి సదుపాయం తక్కువ
  – రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల్లో 90శాతం మంది అప్పుల పాలైనవారే
  –  నగరాల్లో ,గ్రామాల్లో అప్పు తీసుకునే చేసే ఎస్సీ, ఎస్టీల్లో అత్యధికులు ఇంటిఖర్చుల కోసం అప్పు చేసిన వారే.
  –  గ్రామాల్లో అత్యధిక శాతం ఎస్సీలకు,నగరాల్లో అత్యధిక శాతం ఎస్టీలకూ బ్యాంకు ఖాతాలు లేవు.
  –  తెలంగాణ ప్రజల్లో సగం మందికి పైగా తమ రుణావసరాలకు ఇప్పటికీ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల మీదే ఆధార పడ్డారు.
  –  వాణిజ్య బ్యాంకులు కేవలం 16 శాతం రుణావసరాలను, సహకార సంస్థలు 9.3 శాతం రుణావసరాలను మాత్రమే తీరుస్తున్నాయి.
  ఉపాధి
  –  2011-12 కి రాష్ట్రంలో ఐదింట ఒక వంతు మంది యువకులు ఇటు విద్యాసంస్థల్లోగానీ, అటు ఉద్యోగాల్లో కానీ లేరు. 2004-2005 కి వీరి సంఖ్య 14.5 శాతానికి తగ్గింది.
  –  పదకొండు శాతం యువత నిరక్షరాస్యులు. 2004-5నాటికి వీరి సంఖ్య 30శాతానికి పెరిగింది.
  –  2011-12 నాటికి తెలంగాణలో సెకండరీ స్థాయివరకూ చదువుకున్నావారి సంఖ్య 62శాతానికి చేరింది.
  వీరికి ఉద్యోగం,జీవనోపాధి లభించే విధంగా వత్తి నైపుణ్యం పెంచుతూ శిక్షణ ఇవ్వాల్సి ఉంది.
  విద్య
  –  సర్వే ప్రకారం 14శాతం మంది అసలు బడిలో పేరు నమోదు చేసుకోని వారే .
  బడిలో నమోదు చేసుకోవడంలో కనిష్టం (1.3 శాతం)నిజాబాబద్‌ జిల్లా, గరిష్టం మహబూబ్‌ నగర్‌ జిల్లా (37 శాతం)
  –  బడిలో పేరు నమోదు చేసుకున్న వారిలో నాలుగింట మూడు వంతుల మంది మాత్రమే చదువు పూర్తి చేశారు.
  –  గ్రామీణ ప్రాంతాల్లో చదువు పూర్తి చేసిన వారి సంఖ్య మరీ తక్కువ
  –  సామాజిక శాస్త్రాలు చదివిన వారు మెదక్‌ జిల్లాలో ఎక్కువ
  –  సర్వే చేసిన గ హస్థుల్లో పదిశాతం మందికి మాత్రమే ఇంట్లో కంప్యూటర్లున్నాయి.
  –  హైదరాబాదులో 26శాతంమంది ఇళ్లలో, రంగారెడ్డి జిల్లాలో 10శాతం మంది ఇళ్లలో కంప్యూటర్లు ఉన్నాయి.మిగతా జిల్లాలో కేవలం పది శాతం మంది ఇళ్లలో మాత్రమే కంప్యూటర్లున్నాయి.
  జాతీయ స్థాయిలో ,రాష్ట్ర స్థాయిలో వివిధ కార్యక్రమాల డిజిటలైజేషన్‌ విజయవంతంగా అమలు కావాలంటే కంప్యూటర్లు వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరగాల్సి ఉంటుంది.
  పౌరసరఫరాల వ్యవస్థ
  –  రాష్ట్రంలో ఐదింట నాలుగు వంతుల మందికి రేషన్‌ కార్డులున్నాయి.మొత్తం కార్డుల్లో 84.2శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉండే వారికి ఇచ్చే కార్డులే.మొత్తం కార్డుల్లో 2.7శాతం కార్డులు అంత్యోదయ కార్డులే. ఇవి నగరాల కంటే గ్రామీణప్రాంతాల్లోనే ఎక్కువ.
  –  తెలంగాణ కుటుంబాల్లో నాలుగో వంతు మంది బియ్యం కోసం రేషన్‌ కార్డులమీద ఆధారపడ్డవారే. మిగతా వారు ఇతర మార్గాల్లో బియ్యం పొందుతున్నారు.
  –  గ్రామాల్లో వినియోగించే బియ్యంలో 32శాతం రేషన్‌ బియ్యమే. నగరాల్లో 16శాతం మంది గహస్థులు రేషన్‌ బియ్యం తింటున్నారు.
  – ఎస్సీ, ఎస్టీల్లో ఎక్కువ మంది కేవలం రేషన్‌ బియ్యం మీదే ఆధార పడ్డారు, ఎస్సీల్లో వినియోగం28 శాతం,ఎస్టీల్లో వినియోగం 32 శాతం
  –  నగరాల్లోని గహస్థుల కంటే గ్రామీణ గహస్థుల్లో తణ ధాన్యాల వినియోగం ఎక్కువ.
  నగరాల్లో గోధుమ మరియు గోధుమ ఉత్పత్తుల వినియోగం ఎక్కువ
  –  గ్రామీణుల తణధాన్యాల్లో జొన్నల వినియోగం ఎక్కువ. ముఖ్యంగా ఎస్టీల్లో జొన్నల వినియోగం ఎక్కువ,
  –  తణధాన్యాల వినియోగానికి ఎక్కువ ఖర్చు చేసేవారు ఎస్టీ గహస్తుల్లో ఎక్కువ.
  నిజానికి పేదల్లో పేదలయిన నిరుపేదల్లో ఎక్కువ మందికి పౌరసరఫరాల వ్యవస్ధను అందుబాటులోకి తేవలెను.
  –  ఎస్సీల్లో 20శాతం కుటుంబాలకు రేషన్‌ కార్డులుగానీ, సబ్సిడీ బియ్యంగానీ అందుబాటులో లేవు. రేషన్‌ కార్డుల్లేని ఎస్టీల్లో 36శాతం మంది నిరుపేదలు.
  ఆరోగ్యం
  –  వైద్య,ఆరోగ్యంలో జాతీయ స్థాయితో పోలిస్తే తెలంగాణ ముందున్నది.
  –  అయితే ధర్మాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య మెరుగు పర్చాల్సిన అవశ్యకత ఉన్నది.
  –  గ్రామీణ ప్రాంతాల్లో రోగ గ్రస్థులయ్యేవారు ఎక్కువ
  –  గ్రామీణ తెలంగాణలో వైద్యానికయ్యే ఖర్చ జాతీయ స్థాయి సగటు కంటే చాలా ఎక్కువ
  గ్రామాల్లో రోగాల బారిన పడే వారు ఎక్కువ కావడం ప్రయివేటు ఆస్పత్రుల మీద ఆధారపడటం ఆందోళన కల్గించే అంశం
  గహాలు
  –  79.6శాతం ఎస్సీ కుటుంబాలకు పక్కా ఇళ్లు లేవు.
  –  రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా భేష్‌
  –  అన్ని జిల్లాల కంటే వెనుక ఉన్న మెదక్‌ జిల్లాలో కూడా విద్యుత్‌ సరఫరా 97శాతం.
  –  29శాతం గహస్థులకు చెత్త పారేసే సదుపాయం లేదు.
  –  37శాతం మంది తమ సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
  –  18శాతం మంది తాగునీరు కోసం వాటర్‌ బాటిళ్ల మీద ఆధార పడ్డారు.
  –  గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత దక్షిణాది రాష్ట్రాలన్నటి కంటే ఎక్కువ.జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువ.
  –  అనేక జిల్లాల్లో తాగునీరు సమద్ధిగా లేదు
  –  తాగునీటి సదుపాయాలకు సంబంధించి తెలంగాణలోని అన్ని జిల్లాల కంటేకూడా పాలమూరు వెనుకబడి ఉంది.
  –  తాగునీటి సదుపాయం అందుబాటులో లేని సామాజిక వర్గాల్లో ఎస్టీలది ప్రధమ స్దానం. రెండో స్థానం ఎస్సీలది.
  –  గ్రామీణ ప్రాంతాలు,నగరాల మురికివాడల మీద తక్షణం దష్టి పెట్టాల్సి ఉంది.

   

   

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *