అతడి వెంట… చింతకుంట…

A young man's crusade to light up a remote Rayalaseema village

ఎంబీఏ చదివి పట్నంలో ఉద్యోగం చేస్తున్న లోకేష్‌ ఒక రోజు తన గ్రామానికి వచ్చాడు. సాగునీరు లేక,పంటలు ఎండి బీడుగా మారుతున్న ఊరుని వదిలి వలస పోతున్న గ్రామస్తులను చూశాడు. ఇదిలాగే సాగితే పలకరించడానికి మనిషి కూడా కనిపించడని , వెంటనే ఉద్యోగం మానేసి, ఊరుని మార్చడానికి పలుగూ,పార పట్టాడు. అభివృద్ధి అంటే ఇంటి గుమ్మం వరకు సిమెంట్‌ రోడ్డు కాదని, ఆ రహదారిలో పాడిపంటలు ఇంటికి నడిచి వచ్చినపుడే అసలైన ప్రగతి అని భావించి ముందుగా రైతుల పొలాల్లో పంట కుంటలు తవ్వారు. వాలుకడ్డంగా రాతి కట్టలు వేశారు. వీరి ఆలోచనకు ఉపాధి హామీ పథకం తోడయింది…

chintakunta.chittore district

chintakunta.chittore district

రెండేళ్ల క్రితం చేసిన పనులు ఇపుడు ఫలించాయి. నేలలో నీరు ఇంకి ఊరంతా ఆకుపచ్చగా మారింది. రెండు పంటలు వరి పండిస్తున్నారు. మామిడి కొమ్మలు పూతతో కళకళలాడుతున్నాయి. అరవై నీటికుంటలతో ‘చింతకుంట’ చిగురించడం వెనుక గ్రామస్తుల ఐక్యమత్యం ఉంది. వారిలో చైతన్యం నింపిన లోకేష్‌ని సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.

నేడు వారు టాయిలెట్లు, సిసిరోడ్ల కోసం ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం పడిగాపులు పడటం లేదు,తమ సొంత డబ్బుతో వాటిని నిర్మించుకొని పంచాయితీ కి బిల్లులు పెడుతున్నారు… వారి శ్రమ చైతన్యం ప్రభుత్వాధికారులను విస్మయ పరుస్తోంది. ( చింతకుంట,
చిత్తూరు కి 60 కి .మీ )

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *