ఒక సామాజిక ఆర్ధిక మండలి కథ

women worker_sricity_ruralmedia

ఒక సామాజిక ఆర్ధిక మండలి కథ
గ్రామమే ప్రగతికి కేంద్రమని, ఘనమైన అభివ ద్ధి కావాలని మహాత్మా గాంధీ కన్న గ్రామ స్వరాజ్యం కలను నిజంచేసే చారిత్రక ప్రయత్నంలో మంచి చెడులపై అధ్యయనం ఇది. నవ్యాంధ్రప్రదేశ్‌కి దక్షిణాన తమిళనాడుకు సమీపంలో చిత్తూరు జిల్లాలో 2006లో ఏర్పాటైంది శ్రీసిటీ పారిశ్రామిక వనం. శ్రీసిటీ రూపుదిద్దుకున్న సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో గతంలో ప్రజల జీవన స్థితిగతులెలా వున్నాయి? నేడు ఇక్కడ ఏర్పాటవుతున్న పరిశ్రమల వల్ల జీవన ప్రమాణాలు మారాయా? శ్రీసిటీ కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఎలా వుంది? ఒకప్పుడు తట్టాబుట్టా పట్టుకుని కూలీ పనులకు పోయే పేద ప్రజలకు నేడు ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయా? గ్రామాల్లో నిరుద్యోగం, వలసలు తగ్గాయా? పెరిగాయా? రాళ్ళసీమలో పారిశ్రామిక సౌరభాలు వెల్లివిరుస్తున్నాయా? శ్రీసిటీ రాకతో పరిసర గ్రామాల్లో వచ్చిన ఆర్థిక, సామాజిక మార్పుపై ‘రూరల్‌ మీడియా’ చేసిన అధ్యయనమిది.
ఈ అధ్యయనం ఎందుకు?
శ్రీసిటీలో పరిశ్రమలు ఉత్పాదన మొదలు పెట్టి, ప్రపంచ పెట్టుబడులను ఆకట్టుకుంటున్న సమయంలో స్థానికులకు తగిన ఉపాధి అవకాశాలు కలుగలేదని, ఈ పారిశ్రామిక పార్క్‌ వల్ల పెద్దగా అభివృద్ధి జరగలేదనే విమర్శలు ఇటీవల రావడంతో శ్రీసిటీ పరిధిలోని కొన్ని గ్రామాలను పరిశీలించి, కేస్‌స్టడీ చేయాలని రూరల్‌ మీడియా టీమ్‌ నిర్ణయించింది.
2009లోనే తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థికమండళ్లు పనితీరుపై మేం ఒక పరిశీలన చేసిన సమయంలో సత్యవేడులో కొందరు రైతులను కలిశాం. ఆ సమయంలో శ్రీసిటీ కోసం భూ సేకరణ జరుగుతోంది. శ్రీనివాసులు అనే రైతును అతని పూరిగుడిసెలో కలిసి ”మీ భూములను శ్రీసిటీకి ఎందుకు ఇస్తున్నారు? నేల తల్లిని నమ్ముకోకుండా ఎందుకు అమ్ముకుంటున్నారు?” అని ప్రశ్నించినపుడు…
”ఫలసాయం లేని భూముల్లో సాగు చేయలేకపోతున్నాం, సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా మిగలడం లేదు. అందుకే మార్కెట్‌ రేటు కంటే ఎక్కువ పరిహారం ఇవ్వడంతో అమ్ముకోవాల్సి వచ్చింది” అన్నాడారైతు.
ఇదే రైతును ఇటీవల (నవంబర్‌ 2016) అధ్యయనం సందర్భంగా కలిసినపుడు అతని పూరిల్లు స్థానంలో చక్కని భవనం కనిపించింది. శ్రీసిటీ పరిశ్రమల్లో కాంట్రాక్టు పనులు చేసుకుంటూ అతడు కుటుంబంతో సంతోషంగా జీవించడం గమనించినపుడు ఈ ప్రాంతంలో జరుగుతున్న ఆర్థిక మార్పు మాకు కనిపించింది..
ఏడేళ్ళ క్రితం బతుకుతెరువు కోసం అటు తిరుపతికో, ఇటు చెన్నైతో వెళ్లిన చాలామంది నిరుద్యోగులు నేడు వెనక్కి వచ్చి ఈ ఆర్థిక మండలిలో ఉద్యోగాలు పొందంటం మా దృష్టికి వచ్చింది. గతంలో ఉపాధి కోసం భూస్వాముల దగ్గర తలొంచుకుని నిలబడిన భూమిలేని నిరుపేదలు నేడు సెజ్‌లో వారి అర్హతలకు తగిన పని దొరకడంతో తలెత్తుకొని బతుకుతున్నారు. దీనివల్ల సామాజిక అసమానతలు తగ్గి పెత్తందారీతనం పోయింది!
అధ్యయనం జరిగిందిలా…
2016 నవంబర్‌ 8-10 తేదీల్లో చిత్తూరు జిల్లా, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలలోని 14 గ్రామాల్లో ‘రూరల్‌ మీడియా’ ఈ అధ్యయనం చేపట్టింది. 300కి పైగా రైతులు, భూమి లేని నిరుపేదలు, మహిళలు, యువతీ యువకులు, శ్రీసిటీలో పనిచేస్తున్న ఉద్యోగులు, గ్రామ పెద్దలను కలసి మాట్లాడింది. వారి ప్రాంతంలో శ్రీసిటీకి ముందు, తరువాత కలిగిన ఆర్థిక, సామాజిక మార్పును తెలుసుకుంది. పరిశ్రమల ఏర్పాటు వల్ల పర్యావరణానికి నష్టం కలిగిందా? అనే అంశంపై కూడా ఆరా తీశాం. స్థానికులకు ఉపాధి అవకాశాలు ఎంతవరకు లభించాయి. పారిశ్రామికవాడ మధ్యలో వున్న గ్రామాల పరిస్థితి ఎలా వుంది? విద్య, వైద్యం, మొక్కల పెంపకం తదితర గ్రామాభివద్ధి కార్యక్రమాలపై శ్రీసిటీ యాజమాన్యం ఎలాంటి కార్యాచరణ చేస్తోందనే అంశంపై కూడా పరిశీలన చేశాం!
1, చెరగని గ్రామాలు
ప్రత్యేక ఆర్థిక మండలి మధ్యలో 14 గ్రామాలున్నప్పటికీ వాటిని కదపకుండానే పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేశారు. మారుమూల గ్రామాల నుంచి జాతీయ రహదారికి వెళ్ళడానికి సెజ్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక రహదారులను ప్రజలు ఉపయోగించుకుంటున్నారు.
2, మహిళాసాధికారత
” గతంలో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రంలేనందున పూర్తిగా కుటుంబంలోని మగవారిపై ఆధారపడేవారు, శ్రీసిటీ రాకతో స్త్రీలలో అధిక శాతం మందికి ఉపాధి దొరికినందున, స్వయం సమృద్ధి సాధించారు. క్రమేణా గ్రామాల ఆర్ధిక ముఖచిత్రం మారి పూరిగుడిశెలు పోయి పక్కా ఇళ్ళు, కాంక్రీట్‌ భవంతులు వెలుస్తున్నాయి.”
…. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ సర్వే
3, రెట్టింపు అయిన వార్షిక ఆదాయం
” స్థానిక ప్రజలలో సుమారు 85 శాతం మందికి శ్రీసిటీ వలన స్థిరమైన ఉపాధి లభించి, వారి ఆదాయం గణనీయంగా వద్ధి పొందింది.. శ్రీసిటీ రాకముందు ఒక సగటు కుటుంబం గరిష్ఠ వార్షిక ఆదాయం రూ. 36,000/- ఉండగా, శ్రీసిటీ రాకతో అది రెండింతలైంది. ఒకే కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువమంది ఆర్జించగలుగుతున్నారు”
…. శ్రీవేంకటేశ్వరా విశ్వవిద్యాలయం సర్వే
4, తగ్గిన అసమానతలు
శ్రీసిటీ ఏర్పాటు వల్ల గ్రామాల్లో అసమానతలు తగ్గాయనేది ఒక సామాజిక సత్యం. వ్యవసాయ కూలీలుగా ఎదుగూ బొదుగూ లేకుండా బతికిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సుస్థిర జీవనోపాధులు కలగడంతో జీవన సరళిలో మార్పు వచ్చింది. కొందరు సొంతంగా ట్రాక్టర్లు కొనుక్కుని మరికొందరు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొంది ఆత్మవిశ్వాసంతో అందరితో పాటు ఆర్ధికంగా ఎదుగుతున్నారు.
5, కలుపుతీసే చేతుల్లో కంప్యూటర్లు
ఎటువంటి విద్యార్హతలు లేని స్త్రీలు శిక్షణ పొంది, నైపుణ్యం సాధించి వివిధ వత్తులలో స్థిరపడ్డారు. కలుపుతీసిన చేతులు కంప్యూటర్లను ఉపయోగిస్తున్నాయి. అరక పట్టిన రైతు అధునాతన యంత్రాలపై పని చేయగలుగుతున్నాడు.
6, స్థానిక యువతకు పెరిగిన ఉపాధి
శ్రీసిటీలో ఉత్పత్తి దశకు చేరిన 90 పైచిలుకు పరిశ్రమలలో సుమారు 35,000 మందికి ప్రత్యక్ష/పరోక్ష ఉపాధి దొరుకుతున్నది. వీరిలో సగం మందికి వివిధ యూనిట్లలో ఉద్యోగాలు లభించగా, మిగిలిన వారు శ్రీసిటీ పారిశ్రామిక వాడలో కాంట్రాక్ట్‌ పనులు, హౌస్‌ కీపింగ్‌ వంటి వివిధ / సేవలు అందిస్తూ ఆర్థికంగా స్థిరపడుతున్నారు.
7, సెజ్‌లో చెదరని చెరువులు
కాలుష్య రహిత, పర్యావరణ అనుకూలమైన పరిశ్రమలు ఇక్కడున్నాయి. ప్రాజెక్టు మధ్యలో ఉన్న 14 చెరువులను కదిలించలేదు.ఉఎండిన చెరువుల్లో పూడిక తీసి రీచ్చార్జ్‌ చేయడంలో జలకళ సంతరించుకున్నాయి.
8, ఎస్టేట్‌ కావలి బాధ్యతలు నిర్వహించే నిరక్షరాశ్యులైన సుమారు 411 మంది వృద్ధులకు శ్రీసిటీ యాజమాన్యం నుండి నెలవారీ ఆర్థిక సహాయం అందుతుంది.
ే 9, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలు అత్యంత వెనుకబాటుతనానికి ప్రతీకలుగా పేర్కొనవచ్చు. 2008 దాకా ఇక్కడ ఒక్క ఐటిఐ కానీ, పాలిటెక్నిక్‌ కాని, డిగ్రీ కళాశాల కాని లేదు. శ్రీసిటీ రాకతో మెరుగైన ఉపాధి అవకాశాల పెరిగి పలు ఉన్నత విద్యాసంస్థలు స్థాపించ బడ్డాయి.
10, శ్రీసిటీ పరిధి గ్రామాలలో ప్రజలు గతంలో కేవలం వ్యవసాయ కూలీలుగా ఉండేవారు, పరిశ్రమల స్థాపనతో, వారు వివిధ రకాలైన ఉపాధి మార్గాలను ఎంచుకొని, స్థిరమైన ఆదాయం పొందుతూ సంతోషంగా జీవిస్తున్నారు
11, శ్రీసిటీలో ఉపాధి పొందుతున్న వారిలో 16.15 శాతం మంది శ్రీసిటీ పరిధి గ్రామాలకు చెందిన వారు కాగా, 29.47 శాతం మంది చిత్తూరు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు/మండలాలకు చెందిన వారు. నెల్లూరు జిల్లాకు చెందిన వారు 27.72 శాతం.
12, శ్రీసిటీ పరిధిలోని 14 గ్రామాలలో కలిపి మొత్తం జనాభా 6142 (1893 కుటుంబాలు). వీరిలో 18-45 సం|| మధ్య వయస్సు గలవారు 3019 మంది, వారిలో 61శాతం మందికి స్థిరమైన ఉపాధి ఉన్నది. మిగిలిన 39 శాతం మందిలో గృహిణులు, విద్యార్థులు, ఆరోగ్య సమస్యలున్నవారు 33.8 శాతం ఉండగా, 5.2 శాతం మంది మాత్రం ఉపాధికై ఎదురు చూస్తున్నారు.
13, ఉపాధి కోసం వలసపోవడం బాగా తగ్గింది. అంతేకాదు పరిశ్రమల రాకతో వలసపోయిన వారు కూడా వెనక్కి వస్తున్నారు.
14, ప్రాథమిక విద్య కూడా లేక ఒకప్పుడు కూలీ పనుల మీద ఆధారపడిన మహిళలకు శిక్షణ ఇచ్చి సెక్యూరిటీ గార్డులుగా, కంప్యూటర్‌ ఆపరేటర్లుగా, సెల్‌ఫోన్‌ తయారీదారులుగా ఉపాధి కల్పించారు.
15, వ్యవసాయం, కూలీపనులే బతుకు తెరువుగా బతికిన ప్రజల్లో ఎక్కువశాతం ఉద్యోగస్తులుగా మారారు. నెలకు
రూ. 5000 నుండి రూ. 15,000 వరకూ సంపాదించే స్థాయికి ఎదిగారు.
16, ఉన్నత విద్యార్హతలున్న స్థానికులకు రూ. 12 వేల నుండి రూ. 35 వేల వరకు వేతనాలు వస్తున్నాయి.
17, పదో తరగతి, ఇంటర్‌ చదివిన మహిళలకు ఎక్కువగా ఉపాధి కలిగింది. సెల్‌ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌ కాన్‌లో 9 వేల ఉద్యోగాల్లో 90 శాతం మహిళలే! క్యాడ్బరీ, ఇసుజు, ఎవర్టన్‌, కెల్లాగ్స్‌లో కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య అధికమే.
18, ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి ఇక్కడ ఉద్యోగాలు దొరికాయి. మొత్తం కుటుంబాల సంఖ్యలో అటువంటి కుటుంబాలు సుమారు 34 శాతం ఉన్నాయి. ఉదాహరణకు తొండూరు గ్రామస్తుడు నాగేంద్రబాబు కుటుంబంలో నలుగురికి ఉపాధి కలిగింది.
19,విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, స్కూల్‌ బస్‌ సౌకర్యం కల్పించి శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను మెరుగుపర్చడంలో శ్రీసిటీ ఫౌండేషన్‌ చేసిన కృషి వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగి,డ్రాపవుట్స్‌ తగ్గారు.
20, ఉపాధి లేక, ఏమీతోచక ఒకప్పుడు సెల్‌ఫోన్లో పాటలు వింటూ కాలక్షేపం చేసిన గ్రామీణ యువతులు నేడు సెల్‌ఫోన్‌లే తయారు చేసే స్థాయికి ఎదగడం అభివృద్ధికి అద్దం పడుతుంది.
21, ఇదే ప్రాంతపు రైతు శ్రీనివాసులును 2009లో ‘రూరల్‌మీడియా’ కలిసినపుడు ఇరుకైన పూరింట్లో కుటుంబంతో కన్పించారు. నేడు అదే రైతు శ్రీసిటీలో కాంట్రాక్టు పనులు చేసుకుంటూ అందమైన భవనంలో నివసించడం సామాజిక మార్పుకునాంది.

సూచనలు :
1 పారిశ్రామిక పార్క్‌లో పరిశ్రమల సంఖ్య పెరగడంతో ఉద్యోగుల సంఖ్య పెరిగి నివాస స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెరిగింది. ఒకప్పుడు ఎకరం రూ. 30 వేలు వున్న భూమి నేడు రూ. కోటికి పెరిగింది.
ఈ బూమ్‌లో అక్రమ లేఅవుట్ల సమస్యలు మొదలయ్యాయి.
2 స్థానికులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించడం లేదని కొందరు అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు.
3 పారిశ్రామిక పార్క్‌లోని పరిశ్రమల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల గురించి గ్రామీణ యువతకు సమాచారం తెలీడం లేదని కొందరు నిరుద్యోగులు మాతో చెప్పారు.
4 ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు రావడంవల్ల కొన్ని గ్రామాల మధ్య అసూయలు పెరిగాయని కొందరు మా దష్టికి తెచ్చారు.
5 ఉద్యోగాలు పొందినవారు సంత ప్తిగా వుంటే, పొందనివారు అసంత ప్తికి గురవుతున్నారు. పని సంస్క తి పెరిగినప్పటికీ పనిచేసినా, చేయకపోయినా కొందరు జీతాలు పొందుతూ బద్ధకానికి అలవాటు పడుతున్నారని ఒక సర్పంచ్‌ మాతో ఆవేదన వ్యక్తం చేశారు.
6 సెజ్‌లో అంతర్గత రహదారుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి, స్పీడ్‌ బ్రేకర్స్‌ వేసి, హెల్మెట్‌ తప్పనిసరిచేయాల్సిన అవసరం ఉంది.
7 దాదాపు 90 పరిశ్రమలు కార్యకలాపాలు మొదలుపెట్టడంతో ఉద్యోగుల అవసరం ఎక్కువ. ఆయా కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులు, వారి అర్హతల గురించి ప్రకటనలను గ్రామ పంచాయితీలకు పంపాలి,
శ్రీసిటీ హెచ్చార్‌డి ద్వారా గ్రామాల్లో ప్రచారం కల్పించాలి.
టీం, రూరల్‌మీడియా

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *