రైతులకు ‘మార్కెట్’ భాష రావాలి

Andhra Pradesh Rural Inclusive Growth Project

  రైతులకు ‘మార్కెట్’ భాష రావాలి 

పేదరిక నిర్మూలన అనేది మనం మన లబ్దిదారులకు వ్యాపార జ్ఞానం అందించినప్పుడే సాధ్యమవుతుందని ప్రపంచబ్యాంకు లీడ్ డా. పరమేష్ షా అన్నారు. “మనకు ‘మార్కెట్’ భాష వచ్చి ఉండాలని” అయన అన్నారు. విజయవాడలో 3 రోజులపాటు సర్ప్ కార్యాలయంలో జరిగిన గ్రామీణ సమ్మిళిత వృద్ది ప్రాజెక్టు పనులు అయన సమీక్షించారు. పంట పండిస్తున్న రైతు సంఘాలు కేవలం వారి ఉత్పత్తి అమ్ముకోవడానికే పరిమితం కాకుండా, అదే ప్రాంతంలో అదే పంటను పండిస్తున్న ఇతర రైతుల నుంచి కూడా ఉత్పత్తుల్ని సేకరించి మార్కెట్ చేయడం ద్వార మరింత ఆదాయాన్ని పొందవచ్చునని ఆయన అన్నారు.
    బడుగులకు ‘వెలుగు’
Andhra Pradesh Rural Inclusive Growth Project అమలు తీరు సమీక్షించడానికి ప్రపంచ బ్యాంకు బృందం నాలుగు రోజులు పాటు రాష్ట్రంలో పర్యటించింది. SC-ST జనాభా ఎక్కువగా వున్న మండలాలు, వర్షాభావ పరిస్థితులు వున్న 150 మండలాల్లో ఈ ప్రాజెక్టు అమలవుతున్నది. (అన్ని గిరిజన మండలాలతో సహా)
బ్యాంకు రూరల్ డెవలప్మెంట్ లీడ్ డా . పరమేష్  ఈ  టీం కు నాయకత్వం వహిస్తున్నారు. 12-14 తేదీల మధ్య SERP ఆఫీస్ లో వీరి సమీక్ష సమావేశం జరిగింది. 13 జిల్లాల ‘వెలుగు’ ప్రాజెక్టు అధికారులు, ట్రైబల్ ప్రాజెక్టు అధికారులు ఆయా జిల్లాల్లో APRIGP పురోగతిపై బ్యాంకు బృందం ముందు ప్రజెంటేషన్లు ఇచ్చారు.
– johnson choragudi

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *