ఒక దీపం వెలిగింది.

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక దీపం వెలిగింది.
ఆ చీకటి పల్లెకు ఆమె వెలుగై వస్తోంది.
మారుమూల సగటు మనుషులతో స్నేహం చేసి వారి జీవన చిత్రాన్ని లోకానికి పరిచయం చేసే క్రమంలో, కరెంట్‌ తీగ ఎలా ఉంటుందో తెలియని ‘మాధవరం కుయ్యవంక’ స్టోరీ చేశాం. ఆ రిపోర్ట్‌ చదివిన కర్నాటకకు చెందిన సీనియర్‌ అధికారి సతీమణి స్పందించారు.గుడ్డిదీపం వెలుతురులో గంగులమ్మ పిల్లలకు చదువు చెబుతున్న తీరు కదిలించిందన్నారు. ఆ గ్రామానికి విద్యుత్‌ తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని మాకు చెప్పారు. ఆ గ్రామం పూర్తి వివరాలు అమెకు అందించే పనిలో ఉన్నాం. విద్యుత్‌ తో పాటు అక్కడి పిల్లలకు విద్య అందేలా , ప్రజలకు మౌలిక వసతులు కల్పించే దిశగా ఆమె తోడ్పతనానని చెప్పారు. ‘అభివృద్ది కార్యక్రమాలు మొదలయ్యే వరకు తన వివరాలు వెల్లడి చేయవద్దు’ అని ఆమె మాతో అన్నారు.
జనహితం కోసం,రూరల్‌మీడియా, నిర్మాణ్‌ కలిసి చేస్తున్న ప్రయాణంలో ఇదొక మైలురాయి.

Share.

Leave A Reply