సెక్స్ వర్కర్ గా మారిన ఓ స్త్రీ జీవితం

A Autobiography of a Sex Worker

“సెక్స్‌వర్క్ నా దినవారీ జీవితంలో మార్పులు తెచ్చింది. నా గత జీవితమంతా కష్టాలతో, వేదనతో గడచిపోయింది. కాస్త శుభ్రంగా తయారయ్యేందుక్కూడా సమయం దొరికేది కాదు. సెక్స్‌వర్కర్‌గా జీవితం మొదలుపెట్టాక, నా శరీరంపై శ్రద్ధ తీసుకోవటం తప్పనిసరైంది. శుభ్రమైన మంచి బట్టలు వేసుకోవటం నా మనసుకు ఆహ్లాదాన్నీ, ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. దీనివల్ల మగవాళ్ళు నన్ను చూసే దృష్టిలో మార్పు వచ్చింది. అంటే వాళ్ళు నా క్లయింట్లుగా రావటమని కాదు నా ఉద్దేశ్యం – నా ఉనికిని గుర్తించి తీరాల్సిన అవసరం వాళ్ళకు ఏర్పడుతోందని మాత్రమే.”

Nalini Jameela

Nalini Jameela

“మాకు కావల్సింది మీ దయా, దాక్షిణ్యాలు కాదు – మా అస్తిత్వానికి గుర్తింపు. ఐతే, జయశ్రీలాంటి కొద్ది మంది తప్ప సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్‌వర్కర్లకు గుర్తింపునివ్వటానికి ఇష్టపడటం లేదు. సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తూంటారు. చాలా మంది ఫెమినిస్టుల ఆలోచన కూడా ఇందుకు భిన్నంగా లేదు”

“ఇళ్ళల్లో పాచిపని చేసే ఆడవాళ్ళ పరిస్థితికూడా మెరుగ్గా లేదు. ఆ ఇళ్ళల్లో మగవాళ్ళు ఈ పనిమనుషులను “నీచమయిన”పనులు చెయ్యమని వత్తిడి చేస్తూంటారు. కప్పల్ని మింగటానికి పాముల్లాగా పొంచివుండి, కాస్త ఏమరుపాటుగా కనపడగానే గుటుక్కున మింగేస్తారు.”

“పెళ్ళయితే జీవితానికి రక్షణ దొరుకుతుందన్న భరోసా కరువయింది. ఐతే, క్లయింట్లు చేసే హింసకు బాధపడేవాళ్ళుకూడా, భర్తల హింసను భరించటానికి అలవాటుపడ్డారంతే.”

“సెక్స్ వర్కర్లుగా మేం నాలుగు రకాల అవస్థలను తప్పించుకున్నాం. మొగుడికి వండి వార్చటం, అతని మురికి గుడ్డలుతకటం, పిల్లల్ని పెంచుకునేందుకు అతని మీద ఆధారపడనక్కర్లేదు, అతని ఆస్తిపాస్తుల్లో వాటాలిమ్మని దేబిరించే అవసరమూ లేదు.”

– నళినీ జమీలా

10% డిస్కౌంటుతో ఈ పుస్తకం డౌన్లోడు చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి!

http://kinige.com

 

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *